భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ప్రోమో.. రోమాలు నిక్కపొడుచుకుపోవాల్సిందే | Sakshi
Sakshi News home page

India Vs Pakistan Match Promo: భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ప్రోమో.. రోమాలు నిక్కపొడుచుకుపోవాల్సిందే

Published Sun, Oct 24 2021 5:01 PM

India Vs Pakistan Match Promo Released By ICC - Sakshi

India Vs Pakistan Match Promo Released By ICC: టీ20 ప్రపంచకప్‌-2021లో భాగంగా భారత్-పాక్‌ల మధ్య ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానున్న మ్యాచ్‌కు సంబంధించిన ప్రోమోని ఐసీసీ ఇవాళ ఉదయం ట్విటర్‌ వేదికగా విడుదల చేసింది. ఈ మ్యాచ్ కోసమే ఐసీసీ ఈ వీడియోను ప్రత్యేకంగా రూపొందించింది. 58 సెకన్ల నిడివి గల ఈ వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్‌ చేస్తుంది. 

'టుడే ఈజ్‌ బిగ్‌ డే' అనే టైటిల్‌తో మొదలయ్యే ఈ వీడియో.. ఇండియా, పాకిస్థాన్‌, రైవల్రీ, ప్యాషన్, ప్రెషర్ అనే పదాలతో రూపొందించబడి, 'ద వరల్డ్ ఈజ్ వాచింగ్ యు' అనే టైటిల్‌తో ముగుస్తుంది. గతంలో జరిగిన మ్యాచ్‌లకు సంబంధించిన  క్లిప్పింగ్స్‌తో పాటు ఇరు జట్ల ఆటగాళ్ల బౌలింగ్, బ్యాటింగ్ విన్యాసాలు, అభిమానుల కోలాహలంతో రూపొందించిన ఈ ప్రోమో వీడియో చూస్తున్నంత సేపు సగటు క్రికెట్‌ అభిమాని రోమాలు నిక్కపొడుచుకుపోవాల్సిందే. 
చదవండి: భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై రాందేవ్‌ బాబా సంచలన వ్యాఖ్యలు

Advertisement
Advertisement