
వెస్డిండీస్‌తో తొలి వన్డేలో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. చారిత్రాత్మక 1000వ వన్డేలో 36 బంతుల్లో 34 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మ(60 పరుగులు) తర్వాత టీమిండియాలో సూర్యదే టాప్ స్కోర్. సూపర్ ఇన్నింగ్స్‌తో విజయంలో తన వంతు పాత్ర పోషించిన సూర్య.. మ్యాచ్ సందర్భంగా విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్‌తో జరిగిన సంభాషణ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్‌లో సూర్య, పొలార్డ్ సహచర ఆటగాళ్లన్న సంగతి తెలసిందే. సూర్య ఆట, షాట్ సెలక్షన్ గురించి అవగాహన ఉన్న పొలార్డ్... వన్డే మ్యాచ్‌లో అతడిని మాటలతో కవ్వించాడు. ఈ విషయంపై స్పందించిన సూర్యకుమార్ యాదవ్... ‘‘పొలార్డ్ నాకు కొన్ని విషయాలు చెప్పాడు. మిడ్ వికెట్ ఓపెన్ ఉంది కదా. ఐపీఎల్‌లో ఆడిన మాదిరిగా ఫ్లిక్ షాట్ ఇక్కడెందుకు ఆడటం లేదు’’ అని నన్ను అడిగాడు.
‘‘ఐపీఎల్‌కు... వన్డేకు తేడా ఉంది కదా! చివరి వరకు క్రీజులో ఉండాలనుకుంటున్నా.. అందుకే షాట్ ఆడటం లేదు అని చెప్పాను’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా అరంగేట్ర ఆటగాడు దీపక్ హుడాతో భాగస్వామ్యం నెలకొల్పడం గురించి మాట్లాడుతూ... ‘‘గత ఏడేళ్లుగా తను దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. ఆఖరి వరకు క్రీజులో ఉండటం తనకు ముఖ్యం. అయితే... తనకు నేనేమీ సలహాలు ఇవ్వలేదు. ఆత్మవిశ్వాసంతో అతడు అజేయంగా నిలిచాడు. తన పట్టుదల నాకు నచ్చింది’’ అని చెప్పుకొచ్చాడు.
Not the start to series boys wanted. But we go again on Wednesday. #MenInMaroon #INDvWI pic.twitter.com/1VpPjMHnyZ
— Windies Cricket (@windiescricket) February 6, 2022