Ind Vs Wi 1St T20: Start Time, Date And Venue, Expected Squad Details In Telugu - Sakshi
Sakshi News home page

Ind Vs Wi 1st T20: అలా అయితే రోహిత్‌ సేనకు సవాళ్లు తప్పవు మరి!

Feb 16 2022 10:08 AM | Updated on Feb 16 2022 3:28 PM

Ind Vs Wi 1st T20: When Where Probable XI Head To Head Records - Sakshi

West Indies Tour Of India 2022- T20 Series: కోల్‌కతా వేదికగా టీమిండియా- వెస్టిండీస్‌ మధ్య బుధవారం టీ20 సిరీస్‌ ఆరంభం కానుంది. వన్డే సిరీస్‌ కోల్పోయిన పొలార్డ్‌ బృందం టి20 సిరీస్‌లో ఎలాగైనా శుభారంభం చేయాలనే కసితో బరిలోకి దిగుతోంది. తద్వారా పరాజయాల పరంపరకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలనే లక్ష్యంతో ఉంది.

ఇక ఐపీఎల్‌ మెగా వేలంలో భారీ మొత్తాలు పలికిన విండీస్‌ ఆటగాళ్లు ఆ ఉత్సాహాన్ని తమ ప్రదర్శనలో చూపాలని పట్టుదలతో ఉన్నారు. నిలకడలేమి సమస్యను ఆధిగమిస్తే నిజంగానే విండీస్‌ టి20ల్లో దీటైన ప్రత్యర్థి. పొలార్డ్, పూరన్, పావెల్, హోల్డర్‌లు తమ బ్యాట్లు ఝుళిపిస్తే రోహిత్‌ సేనకు సవాళ్లు తప్పవు.

భారత్‌- విండీస్‌ ముఖాముఖి పోరు- రికార్డులు
భారత్, వెస్టిండీస్‌ మధ్య ఇప్పటివరకు 17 టి20 మ్యాచ్‌లు జరిగాయి. భారత్‌ 10 మ్యాచ్‌ల్లో నెగ్గగా... విండీస్‌ 6 మ్యాచ్‌ల్లో గెలిచింది. మరో  మ్యాచ్‌ రద్దయింది.

మ్యాచ్‌ ఎప్పుడు, ఎక్కడ?
ఈడెన్‌ గార్డెన్స్‌, కోల్‌కతా
ఫిబ్రవరి 16(బుధవారం)- రాత్రి 7 గంటలకు ఆరంభం. 

అంచనా జట్లు:
భారత్‌: ఇషాన్‌ కిషన్‌, రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌/శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), వెంకటేశ్‌ అయ్యర్‌, దీపక్‌ చహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, హర్షల్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌, యజువేంద్ర చహల్‌.

వెస్టిండీస్‌:
బ్రాండన్‌ కింగ్‌, కైల్ మేయెర్స్‌, నికోలస్‌ పూరన్‌(వికెట్‌ కీపర్‌), పావెల్‌, కీరన్‌ పొలార్డ్‌(కెప్టెన్‌), జేసన్‌ హోల్డర్‌, ఫాబియన్‌ అలెన్‌, రొమారియో షెపర్డ్‌, ఓడియన్‌ స్మిత్, అకీల్‌ హొసేన్‌, షెల్డన్‌ కాట్రెల్‌/డొమినిక్‌ డ్రేక్స్‌.

చదవండి: IPL 2022: ఆ ఇద్దరే మా ఓపెనర్లు.. క్లారిటీ ఇచ్చిన సన్‌రైజర్స్ కోచ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement