Navdeep Saini: కసితో వేశాడు.. స్టంప్‌ ఎగిరి గాల్లో పల్టీలు 

IND-A vs SA-A: Navdeep Saini Beauty Sends Off Stump Cartwheeling Viral - Sakshi

Navdeep Saini Sends Off Stump Wicket Cartwheeling.. ఇండియా-ఏ, దక్షిణాఫ్రికా-ఏ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో స్పీడస్టర్‌ నవదీప్‌ సైనీ అద్భుత బంతితో మెరిశాడు. అతని బౌలింగ్‌ దాటికి స్టంప్‌ ఎగిరి గాల్లో పల్టీలు కొట్టి మూడు నుంచి నాలుగు అడుగు దూరంలో పడింది. దక్షిణా ఇన్నింగ్స్‌ 92 వ ఓవర్‌లో ఇది చోటు చేసుకుంది. అప్పుడే క్రీజులోకి వచ్చిన కొత్త బ్యాటర్‌ హెండ్రిక్స్‌ క్రీజులో కుదురుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తన 21వ ఓవర్‌ వేయడానికి వచ్చిన నవదీప్‌ సైనీ ఓవర్‌ తొలి బంతినే 100 కిమీవేగంతో విసిరాడు. పొరపాటున దాన్ని అంచనా వేయని హెండ్రిక్స్‌ వదిలేయడంతో బంతి ఆఫ్‌స్టంప్‌ను గిరాటేసింది. ఇంకేముంది స్టంప్‌ ఎగిరి గాల్లో పల్టీలు కొడుతూ కింద పడింది. అయితే పక్కనే ఉన్న మిడిల్‌ స్టంప్‌, లెగ్‌ స్టంప్‌లు మాత్రం ఇంచుకూడా కదలకపోవడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: IND Tour Of SA Delayed: ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌.. టీమిండియా పర్యటన వాయిదా!

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. సర్ఫరాజ్‌ ఖాన్‌ (94 బంతుల్లో 71 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), హనుమ విహారి (164 బంతుల్లో 54; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. దీంతో 198/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో గురువారం ఆట ప్రారంభించిన భారత్‌ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 74.5 ఓవర్లలో 276 పరుగుల వద్ద ఆలౌటైంది. సర్ఫరాజ్, విహారి ఆరో వికెట్‌కు 60 పరుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ‘ఎ’కు 21 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆడిన దక్షిణాఫ్రికా మూడో రోజు ఆట నిలిచే సమయానికి 5 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. 

చదవండి: IND VS NZ: అతడు టీమిండియా ఓపెనర్‌గా రావాలి...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top