
నేపియర్ వేదికగా జరగాల్సిన భారత్-న్యూజిలాండ్ మధ్య మూడో టీ20కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో భారత కాలమాన ప్రకారం 11:30 పడాల్సిన టాస్ ఇప్పుడు ఆలస్యం కానుంది. అయితే నేపియర్‌లో ప్రస్తుతం వర్షం తగ్గుముఖం పట్టింది. అయితే గత రెండు రోజులుగా వర్షం కురిస్తుండడంతో మైదానం కాస్త చిత్తడిగా మారింది.
ఈ క్రమంలో గ్రౌండ్ స్టాప్ మైదానాన్ని సిద్దం చేసే పనిలో పడ్డారు. ఇక రెండో టీ20లో ఘన విజయం సాధించిన హార్దిక్ సేన్ ఈ మ్యాచ్‌లో కూడా అదే జోరును కొనసాగించి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇక ఆఖరి టీ20కు ఉమ్రాన్ మాలిక్, సంజూ శాంసన్ భారత తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
చదవండి: IND vs NZ: 'న్యూజిలాండ్‌తో మూడో టీ20.. సూర్యకుమార్ స్థానంలో అతడు రావాలి'