IND vs NZ 1st Test- Shreyas Iyer: నెరవేరిన అయ్యర్‌ కల.. దిగ్గజ క్రికెటర్‌ చేతుల మీదుగా క్యాప్‌.. వీడియో

IND vs NZ 2021 1st Test: Shreyas Iyer Received Debut Cap From Sunil Gavaskar in Kanpur - Sakshi

IND vs NZ 2021 1st Test: Shreyas Iyer Received Debut Cap From Sunil Gavaskar in Kanpur Video: టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేయాలన్న శ్రేయస్‌ అయ్యర్‌ కల ఎట్టకేలకు నెరవేరింది. న్యూజిలాండ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం అతడు భారత్‌ తరఫున అంతర్జాతీయ టెస్టుల్లో అడుగుపెట్టాడు. కాన్పూర్‌ వేదికగా తొలి టెస్టు సందర్భంగా దిగ్గజ క్రికెటర్‌ సునిల్‌ గావస్కర్‌ చేతుల మీదుగా టీమిండియా క్యాప్‌(303) అందుకున్నాడు.

కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ అజింక్య రహానే.. జట్టు సభ్యుల సమక్షంలో క్యాప్‌ను ముద్దాడి స్పెషల్‌ మూమెంట్‌ను సెలబ్రేట్‌ చేసుకున్నాడు. ఈ క్రమంలో భావోద్వేగానికి గురైన శ్రేయస్‌ను ఆటగాళ్లంతా ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ షేర్‌ చేయగా వైరల్‌ అవుతోంది. కాగా శ్రేయస్‌ అయ్యర్‌ 2017లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.

ఇప్పటి వరకు 32 టీ20 మ్యాచ్‌లు, 22 వన్డేలు ఆడాడు. వరుసగా 580, 813 పరుగులు సాధించాడు. ఇక ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 54 మ్యాచ్‌లలో 4592 పరుగులు చేశాడు. ఇందులో 12 బసెంచరీలు, 23 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక ఐపీఎల్‌లో ఢిల్లీ ఫ్రాంఛైజీ కెప్టెన్‌గా వ్యవహరించి శ్రేయస్‌ అయ్యర్‌.. 2021 సీజన్‌లో రిషభ్‌ పంత్‌ ఢిల్లీ పగ్గాలు చేపట్టడంతో ఆటగాడిగా కొనసాగాడు. కరోనా నేపథ్యంలో యూఏఈ వేదికగా జరిగిన రెండో అంచెకు అందుబాటులోకి వచ్చిన అయ్యర్‌... 175 పరుగులు చేశాడు.

చదవండి: IPL 2022 Auction- KL Rahul: లక్నో జట్టు కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌..! ఎంత మొత్తమైనా చెల్లించేందుకు సిద్ధం?
IPL 2022 Auction: ముంబై ఇండియన్స్‌ రిటైన్ చేసుకునేది వీళ్లనే..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top