Rohit Sharma: రోహిత్‌ శర్మను చూడడానికి పోటెత్తిన అభిమానులు

Huge Crowd Gathers Outside Hotel Came For Indian Captain Rohit Sharma - Sakshi

క్రికెటర్లకు అభిమానులు ఉండడం సహజం. అయితే తమ ఆరాధ్య క్రికెటర్‌ ఎక్కడున్నాడో తెలిసినప్పుడు అతన్ని చూడడానికి ఎగబడతారు. తాజాగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మను చూడడానికి అభిమానులు పోటెత్తారు. ఆసియాకప్‌ 2022కు సన్నద్దమవుతున్న రోహిత్‌ శర్మ ప్రస్తుతం ముంబైలో ఉన్నాడు. ఒక పని నిమిత్తం హోటల్‌కు వచ్చిన రోహిత్‌.. బయటకు వెళ్లడానికి ప్రయత్నించాడు. అయితే  అప్పటికే హోటల్‌ ముందు అభిమానులు బారులు తీరారు.

దీంతో రోహిత్‌.. ''వామ్మో ఏంది ఇంత జనం'' అన్నట్లుగా రియాక్షన్‌ ఇచ్చాడు. ఆ తర్వాత హోటల్‌ సిబ్బంది వచ్చి అభిమానులు క్లియర్‌ అయ్యాకా హోటల్‌ నుంచి వెళ్లిపోవచ్చు అని రోహిత్‌కు సలహా ఇచ్చి లోపలికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  కాగా యూఏఈ వేదికగా జరగనున్న ఆసియాకప్‌లో ఆగస్టు 28న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌ ఆడనుంది.

చదవండి: Rohit Sharma: 'జెండా కొనడానికి డబ్బులు లేవా'.. పరువు తీసుకున్న హిట్‌మ్యాన్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top