England Leicester Ground Rename: ఇంగ్లండ్‌లో క్రికెట్‌ గ్రౌండ్‌కు టీమిండియా దిగ్గజం పేరు.. చరిత్రలో తొలిసారి

Cricket Ground In England Set To Be-Named After Sunil Gavaskar - Sakshi

టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌లోని లీస్టర్‌షైర్‌ క్రికెట్‌ గ్రౌండ్‌కు 'గవాస్కర్‌ గ్రౌండ్‌'గా నామకరణం చేశారు. రిపోర్ట్స్‌ ప్రకారం ఇంగ్లండ్‌ లేదా యూరప్‌ గడ్డపై ఉన్న క్రికెట్‌ గ్రౌండ్‌కు ఒక ఇండియన్‌ క్రికెటర్‌ పేరు పెట్టడం ఇదే తొలిసారి. సునీల్‌ గావస్కర్‌ తొలి ఆటగాడిగా ఈ అరుదైన ఘనత సాధించి చరిత్రలో నిలిచాడు. ఇటీవలే లీస్టర్‌షైర్‌లో ఐదు ఎకరాల స్థలాన్ని గవాస్కర్‌ సొంతం చేసుకున్నాడు. క్రికెట్‌లో గావస్కర్‌ చేసిన సేవలకు గానూ లీస్టర్‌షైర్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ తమ గ్రౌండ్‌కు 'గావస్కర్‌ గ్రౌండ్‌' అని పేరు పెట్టినట్లు తెలిపింది.

తన స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ పనుల మీద గావస్కర్‌ ప్రస్తుతం లండన్‌లోనే ఉన్నాడు. ఇప్పటికే లీస్టర్‌షైర్‌ గ్రౌండ్‌లోని ఒక పెవిలియన్‌ ఎండ్‌ గోడపై సునీల్‌ గావస్కర్‌ పెయింటింగ్‌ పెద్ద ఎత్తున గీశారు. సన్నీ యువ క్రికెటర్‌గా చేతిలోని బ్యాట్‌ భుజంపై పెట్టుకొని ఫోజు ఇచ్చిన ఫోటోను పెయింటింగ్‌గా వేశారు. కాగా గావస్కర్‌ పేరిట తాంజానియా, అమెరికాల్లోనూ తన పేరిట క్రికెట్‌ గ్రౌండ్‌లు ఉన్నాయి. లీస్టర్‌షైర్‌ గ్రౌండ్‌కు తనపేరు పెట్టడంపై 73 ఏళ్ల దిగ్గజ క్రికెటర్‌ స్పందించాడు. ''లీస్టర్‌షైర్‌ సిటీలో క్రికెట్‌ వాతావరణం ఎక్కువగా ఉంఉటంది.  ముఖ్యంగా ఇక్కడ ఎక్కువగా ఇండియన్ మూలాలున్న క్రికెటర్లు ఎక్కువగా ఉంటారు. అందుకే గ్రౌండ్‌కు నా పేరు పెట్టడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తు‍న్నా'' అంటూ చెప్పుకొచ్చాడు.

భారత క్రికెట్ దిగ్గజం.. లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గావస్కర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెస్టుల్లో టీమిండియా తరపున 10వేల పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు టెస్టుల్లో 34 సెంచరీలు సాధించి అత్యధిక సెంచరీలు అందుకున్న ఆటగాడిగా(సచిన్‌ బ్రేక్‌ చేసేవరకు) నిలిచాడు. ఇక టెస్టుల్లో బెస్ట్‌ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌గా ఆల్‌టైమ్‌ జాబితాలో చోటు సంపాదించాడు. 1971-1987 వరకు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన గావస్కర్‌ లెక్కలేనన్ని రికార్డులు సాధించాడు. సునీల్‌ గావస్కర్‌ టీమిండియా తరుపున 108 వన్డేల్లో  3092 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 125 టెస్టు మ్యాచ్‌ల్లో 10,122 పరుగులు చేసిన గావస్కర్‌ ఖాతాలో 34 సెంచరీలు, 45 అర్థసెంచరీలు ఉన్నాయి.

చదవండి: సరిగ్గా ఇదే రోజు.. విండీస్‌ గడ్డ మీద కోహ్లి డబుల్‌ సెంచరీ! అరుదైన రికార్డు..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top