సహచరుడి గర్ల్‌ ఫ్రెండ్‌తో న్యూడ్‌ వీడియో కాల్.. స్పందించిన బాబర్‌ ఆజమ్‌

Babar Azam Response To Honey Trap Episode - Sakshi

Babar Azam Honey Trap Episode: సహచరుడి గర్ల్‌ ఫ్రెండ్‌తో న్యూడ్‌ వీడియో కాల్‌ మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌.. తాజాగా ఈ ఉదంతంపై స్పందించాడు. తనపై సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఉద్దేశిస్తూ.. సుఖంగా ఉండేందుకు మరీ అంత రిస్క్‌ చేయనన్న అర్ధం వచ్చేలా ట్వీట్‌ చేస్తూ, తనపై వస్తున్న ఆరోపణలకు పరోక్షంగా చెక్‌ పెట్టాడు.

నదీ తీరాన, ఆహ్లాదకరమైన వాతావరణంలో తీసుకున్న తన ఫోటోను షేర్‌ చేస్తూ బాబర్‌ ఈ ట్వీట్‌ చేశాడు. ఈ పోస్ట్‌లో బాబర్‌ నవ్వుతూ ఇచ్చిన పోజ్‌ను బట్టి చూస్తే.. తనపై వస్తున్న ఆరోపణలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా ఉంది. ఈ విషయంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)తో పాటు అభిమానులు కూడా బాబర్‌కు అండగా నిలిచారు.

సోషల్‌మీడియాలో వైరలవుతున్న వీడియోలో ఉన్నది బాబర్‌ కాదని, గిట్టని వారు మార్ఫింగ్‌ చేసిన వీడియోను సోషల్‌మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పీసీబీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. పట్టీపట్టనట్లుగా ఉండటంతో బాబర్‌కు మద్దతుగా నిలుస్తోందని స్పష్టమవుతోంది. 

కాగా, వైరలవుతున్న వీడియోలో బాబర్‌.. తన సహచరుడి (పాక్‌ జట్టులో సభ్యుడు) గర్ల్‌ ఫ్రెండ్‌తో అసభ్య పదజాలం ఉపయోగించి చాటింగ్‌ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. నియో యాదవ్‌ అనే ఓ నెటిజన్‌ పోస్ట్‌ చేసిన ఈ వీడియోలో బాబర్‌, తన సహచర పాకిస్తాన్‌ ఆటగాడి గర్ల్‌ ఫ్రెండ్‌తో సెక్స్‌ చాటింగ్‌ చేస్తున్నాడు.

తనతో చాటింగ్‌ కొనసాగిస్తే.. సదరు అమ్మాయి ప్రియుడికి జట్టులో స్థానానికి ఢోకా ఉండదని ప్రామిస్‌ చేశాడు. ఈ వీడియోతో పాటు పలు అసభ్య చాట్‌ మెసేజ్‌లు, ఆడియో రికార్డింగ్‌లు, బాబర్‌కు సంబంధించిన పర్సనల్‌ ఫోటోలు కూడా సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. ఇప్పటికే స్వదేశంలో వరుస సిరీస్‌ల్లో జట్టును గెలిపించలేక, కెప్టెన్సీ కోల్పోయే ప్రమాదం‍లో ఉన్న బాబర్‌కు తాజా ఉదంతం మరిన్ని తలనొప్పులు తెచ్చిపెట్టింది.
   
 

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top