విరాట్‌కు ముద్దుతో విషెస్‌ తెలిపిన అనుష్క

Anushka Sharma Gives an Affectionate Kiss to Virat Kohli  - Sakshi

దుబాయ్‌ : టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ గురువారం  32వ ఏటలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ఐపీఎల్‌ 13వ సీజన్‌లో భాగంగా యూఏఈలో ఉన్న కోహ్లి భార్య అనుష్క శర్మతో కలిసి ఆర్‌సీబీ టీమ్‌ సభ్యుల సమక్షంలో కేక్‌ను కట్‌ చేశాడు. ఈ సందర్భంగా భార్య అనుష్క శర్మ విరాట్‌కు ప్రేమగా ముద్దుపెట్టి ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. క్యూట్ పెయిర్‌ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  కోహ్లి భార్య అనుష్క ప్రెగ్నెంట్‌ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వచ్చే జనవరిలో తమ ఇంట్లోకి మూడో వ్యక్తి ప్రవేశించబోతున్నట్లు విరుష్కలు ఇప్పటికే ప్రకటించారు. (వైరలవుతున్న కోహ్లి బర్త్‌డే వేడుకలు)

బాలీవుడ్‌ ప్రముఖులతో పాటు పలువురు విరాట్‌కు బర్త్‌బే విషెస్‌ తెలియజేశారు. ఇక ఈ వేడుకల్లో  బెంగళూరు ఆటగాళ్లు కోహ్లీ ముఖానికి కేక్‌ పూసి సందడి చేశారు. వేడుకలో ఆటపాటలు, డ్యాన్సులతో అలరించారు. కోహ్లీ పుట్టిన రోజు సంబరాలకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఆర్‌సీబీకి మొదటిసారి ఐపీఎల్‌ టైటిల్‌ సాధించిపెట్టాలనే కసితో ఉన్న కోహ్లికి ఆ కోరిక నెరవేరడానికి మూడు అడుగుల దూరంలో ఉన్నాడు. శుక్రవారం సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిచేందుకు ఆర్‌సీబీ సంసిద్ధం అవుతుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top