దూప తీర్చని
భగీరథ
జిల్లాలోని మున్సిపాలిటీల్లో మంచి నీటి సమస్య రోజురోజుకూ అధికమవుతోంది. ఎండలు మండుతుండటంతో ప్రజలు నీటి కోసం తల్లడిల్లుతున్నారు. రూ.కోట్లు వెచ్చించి మిషన్ భగీరథ తెచ్చినా ప్రజల గొంతు తడవడంలేదు. పట్టణ శివార్లకు రెండు, మూడు రోజులకోమారు నీటి సరఫరా చేస్తున్నారు. అదికూడా అరకొరగా జరగుతోంది. కొన్ని ప్రాంతాలకు ట్యాంకర్ల నీరే దిక్కవుతోంది. ప్రజలు ఇన్ని బాధలు పడుతున్నా అధికారుల్లో చలనం రావడం లేదు. నీటి సరఫరాను పెంచడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపాలిటీల్లో ప్రధానంగా నీటి సమస్య చర్చనీయాంశంగా మారింది.
శివార్లలో రెండు, మూడురోజులకోసారి సరఫరా
దృష్టిసారించని అధికారులు


