కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ రాజ భద్రయ్య
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): కాంగ్రెస్ పార్టీలో కష్టపడే ప్రతీ కార్యకర్తకు తప్పకుండా పదవులు వస్తాయని, ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఉమ్మడి మెదక్ జిల్లా అబ్జర్వర్ బందెల రాజ భద్రయ్య అన్నారు. సోమవారం సిద్దిపేటలోని డీసీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ జిల్లా చైర్మన్ పోస్టుకు దరఖాస్తులను స్వీకరించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజభద్రయ్య మాట్లాడుతూ ఇప్పటివరకు పార్టీ జిల్లా ఎస్సీ డిపార్ట్‌మెంట్ చైర్మన్‌గా కొనసాగిన కొమ్ము విజయ్‌కుమార్‌తో పాటు 26 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. దరఖాస్తులను పార్టీ స్టేట్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణకు అందజేస్తామని, పరిశీలించి నిష్పక్షపాతంగా ఎంపిక చేస్తారన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గాడిపల్లి రఘువర్ధన్ రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎస్సీ డిపార్ట్‌మెంట్ చైర్మన్ పత్తి కుమార్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


