పాత పెన్షన్‌ విధానమే వర్తింపజేయాలి | - | Sakshi
Sakshi News home page

పాత పెన్షన్‌ విధానమే వర్తింపజేయాలి

May 11 2026 9:49 AM | Updated on May 11 2026 9:49 AM

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేయడం హేయమైన చర్య అని ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (టీపీటీఎఫ్‌) రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో తిరుపతిరెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ(2003) ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్పష్టమైన తీర్పు ఇచ్చిందన్నారు. 2004 సెప్టెంబర్‌కు ముందు నోటిఫికేషన్‌ ద్వారా నియామకాలు పొందిన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తోందన్నారు. రాష్ట్రం ప్రభుత్వం మాత్రం అమలు చేయడంలో విఫలమవుతోందన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్‌ చేశారు.

టీపీటీఎఫ్‌ రాష్ట్ర అసోసియేట్‌

అధ్యక్షుడు తిరుపతిరెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement