నల్ల బ్యాడ్జీలతో బీసీ నేతల నిరసన | - | Sakshi
Sakshi News home page

నల్ల బ్యాడ్జీలతో బీసీ నేతల నిరసన

May 11 2026 9:49 AM | Updated on May 11 2026 9:49 AM

హుస్నాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో బీసీ రిజర్వేషన్లపై ప్రకటన చేయకపోవడంపై బీసీ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు, తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్ల బిల్లును 9వ షేడ్యూల్‌లో చేర్చి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. జనగణనలో కులగణను చేర్చి లెక్కించాలన్నారు. బీసీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించాలన్నారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో పాటు బీసీ రక్షణ చట్టం చేయాలన్నారు. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ పునః సమీక్షించి, మండల్‌ కమిషన్‌ సిఫార్సులను అమలతో పాటు పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ కన్వీనర్‌ మేకల వీరన్న యాదవ్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి పచ్చిమట్ల రవీందర్‌ గౌడ్‌, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్‌, కాంగ్రెస్‌ నాయకులు వడ్డెపల్లి రమణ, హస్సెన్‌, శ్రీనివాస్‌గౌడ్‌, కౌన్సిలర్లు వరప్రసాద్‌, రమేష్‌, రాజు, శోభన్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement