వర్గల్ కోవెలలో బ్రహ్మోత్సవాలు సంపూర్ణం
వర్గల్(గజ్వేల్): భక్తజనావళికి ఆధ్యాత్మిక పంచిన వర్గల్ వేణుగోపాలుని వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఘటాభిషేకం, చక్రతీర్థంతో ముగిశాయి. అర్చకులు ఆలయ ముఖమండపంలో వేదికపై రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఉత్సవమూర్తులను ఆసీనులను చేశారు. కలశాలు స్థాపన, కలశ పూజ నిర్వహించారు. గర్భగుడిలో మూలవిరాట్టులకు మంత్రోక్తంగా ఘట కలశాభిషేకం నిర్వహించారు. దేవతామూర్తులను సర్వాలంకారశోభితులుగా అలంకరించారు. వసంతోత్సవం, కోనేరులో చక్రతీర్థం (చక్రస్నానం) నిర్వహించారు. వేడుకలలో భక్తజనులు పాల్గొని తరించారు.


