ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాకు చెందిన ప్రముఖ కవి, రచయిత కొమురవెల్లి అంజయ్య వరిష్ట పురస్కారానికి ఎంపికయినట్లు తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి చెన్నయ్య శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగు సాహిత్యరంగంలో అంజయ్య చేస్తున్న కృషికి గాను ఈ పురస్కారం అందిస్తున్నట్లు తెలిపారు. 14న హైదరాబాద్‌లో రూ.20 వేల నగదు, జ్ఞాపికతో సన్మానించనున్నట్లు తెలిపారు.
11న పీఎం నేషనల్
అప్రెంటీస్ మేళా
మెదక్ కలెక్టరేట్: ఈనెల 11న ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఈ మేళాలో జిల్లాతోపాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. 18యేళ్లు నిండి ఏదైనా ఐటీఐ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు.


