చేర్యాల(సిద్దిపేట): రైతులు పండించిన పంటను పూర్తిగా కొనుగోలు చేస్తామని, ఆందోళన చెందవద్దని కలెక్టర్ హైమావతి తెలిపారు. మరోవైపు కొనుగోళ్లు వేగిరం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డుతో పాటు, వేచరేణి గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేర్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్నలు, వరి ధాన్యం ఒకేసారి వచ్చాయన్నారు. మూడు రోజుల్లో అన్ని ఇబ్బందులు తొలగిపోతాయని, అప్పటి వరకు రైతులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.


