పాత పాలకవర్గాలకే మళ్లీ బాధ్యతలు
దుబ్బాక: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో మళ్లీ పాత పాలకవర్గాలే కొనసాగనున్నాయి. యథావిధిగా పాత పాలకవర్గాలే కొనసాగించాలంటూ హైకోర్టు తీర్పు నిచ్చింది. ఈ నేపథ్యంలో పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టాలని
రాష్ట్ర స్పెషల్ కమిషనర్ అండ్ రిజిస్ట్రార్ కో ఆపరేటీవ్ సొసైటీస్ ప్రసన్న పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో మంగళవారం చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లుగా తమ తమ సహకార సంఘాల్లో బాధ్యతలు స్వీకరించారు. సహకార సంఘాలకు నామినేటేడ్ లేదా ఎన్నికల ద్వారా కొత్త కమిటీలను ఎన్నుకునే వరకు పాత కమిటీలనే కొనసాగించాలని కోర్టు తీర్పు నిచ్చింది.
గత నవంబర్ నుంచి..
పీఏసీఎస్‌ల పాలక వర్గాల పదవీకాలం ముగియడంతో మరో ఆరు నెలల పాటు ప్రభుత్వం పొడిగించింది. కొత్త కమిటీలకు ఎన్నికలు నిర్వహించక పోవడంతో ఇంకో 3 నెలలకు పైగా వారే కొనసాగారు. ఆరు సంవత్సరాల పాటు ఉన్న పాత పాలకవర్గాలను ప్రభుత్వం రద్దు చేస్తూ 2025 నవంబర్‌లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాత పాలకవర్గాలు హైకోర్టును ఆశ్రయించాయి. తాజాగా హైకోర్టు పాత పాలకవర్గాలను కొత్త కమిటీలు నియామకం అయ్యేంత వరకు కొనసాగించాలని తీర్పు నిచ్చింది. 6 నెలల పాటు మాజీలుగా ఉన్న వారు కోర్టు తీర్పుతో తాజాగా పాత పదవుల్లోనే బాధ్యతలు స్వీకరించారు..
21 ప్రాథమిక సహకార సంఘాలు
జిల్లాలో 21 ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. కొత్తగా జిల్లా ఏర్పాటు అయినప్పటికీ ఉమ్మడి మెదక్‌జిల్లా డీసీసీబీ పరిధిలోనే సహకార సంఘాలు పనిచేస్తున్నాయి. జిల్లాల వారీగా డీసీసీబీలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పీఏసీఎస్‌లకు నామినేటెడ్ పద్ధతిలో కమిటీలను ఎన్నుకునే విధంగా యోచిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఆరు నెలల తర్వాత ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు మళ్లీ పాత పాలకవర్గాలనే పునరుద్ధరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం.. పాత పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించడం చర్చనీయంశంగా మారింది.
కొత్త కమిటీలను ఎన్నుకునే వరకు వీరే..
సహకార శాఖ ఉత్తర్వులు జారీ
బాధ్యతలు స్వీకరించిన సభ్యులు
పాలక
వర్గాల
హర్షం
హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా రావడం.. వెంటనే అమల్లోకి తేవడంతో పీఏసీఎస్ పాలకవర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. మళ్లీ పదవుల్లో బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందని దుబ్బాక పీఏసీఎస్ చైర్మన్ శేర్ల కై లాసం, వైస్ చైర్మన్ కాల్వ నరేష్ తెలిపారు.


