హుస్నాబాద్: వేసవి కాలంలో ప్రకృతి ప్రసాదమైన తాటి ముంజలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం నగరంలోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రికి హుస్నాబాద్ గీత కార్మికులు తాటి ముంజలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గీత కార్మికులకు గ్రామీణ ప్రాంతాల్లో తాటి ముంజలు ఆర్థిక వెసులుబాటును కల్పిస్తాయన్నారు. ప్రభుత్వం తరుపున తాటి ముంజల మార్కెటింగ్‌కు సదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రతి ఒక్కరు తాటి ముంజలు తిని ఆస్వాదించాలని కోరారు.
మంత్రి పొన్నం ప్రభాకర్


