రైతుల సమస్యలు పట్టని సర్కార్‌ | - | Sakshi
Sakshi News home page

రైతుల సమస్యలు పట్టని సర్కార్‌

May 5 2026 7:02 AM | Updated on May 5 2026 7:02 AM

రైతుల సమస్యలు పట్టని సర్కార్‌ ● 22 రోజులుగా వడ్లు, మక్కలు కొనుగోలు కేంద్రాల్లోనే ● మాజీమంత్రి హరీశ్‌రావు

● 22 రోజులుగా వడ్లు, మక్కలు కొనుగోలు కేంద్రాల్లోనే ● మాజీమంత్రి హరీశ్‌రావు

సిద్దిపేటరూరల్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రైతుల సమస్యలు పట్టడంలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. రూరల్‌ మండల పరిధిలోని బుస్సాపూర్‌లో జరుగుతున్న బీరప్ప ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక రైతులను తిప్పలు పెడుతోందని మండిపడ్డారు. కేసీఆర్‌ బయటకు వస్తేనే రైతు భరోసా వేస్తున్నారన్నారు. వడ్లు, మక్కలు 22 రోజులగా కొనుగోలు కేంద్రాల్లో ఉంచి రైతులు పడిగాపులు కాస్తున్నారన్నారు. కేసీఆర్‌ ముఖ్య మంత్రిగా ఉన్నపుడు లేని తిప్పలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయన్నారు. బుస్సాపూర్‌కు లిఫ్ట్‌ మంజూరు చేసి 90శాతం పనులు తాను పూర్తి చేశామన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక తట్టెడు మట్టి ఎత్తలేదన్నారు. త్వరలోనే మిగిలిన పనులు పూర్తి చేసి లిఫ్ట్‌తో పంట పొలాల్లోకి నీళ్లు వచ్చేలా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సుడా మాజీ చైర్మన్‌ రవీందర్‌ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీదేవి, గ్రామ సర్పంచ్‌, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement