చేర్యాల(సిద్దిపేట): మున్సిపల్ సాధారణ సమావేశం స్థానిక కార్యాలయంలో చైర్‌పర్సన్ ముస్త్యాల అరుణ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో 20 ఎజెండా అంశాలపై చర్చించిన సభ్యులు 16 అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు కమిషనర్ నాగేందర్ తెలిపారు. ఆమోదం తెలిపిన వాటిలో పారిశుద్ధ్య వాహనాల సర్వీసింగ్, రిపేరింగ్, డీజిల్ బిల్స్, అవుట్ సోర్సింగ్ స్టాఫ్ జీతభత్యాలు, మున్సిపల్ బిల్డింగ్ పునరుద్ధరించుట తదితర అంశాలు తీర్మానించినట్లు తెలిపారు. సమావేశంలో పాల్గొన్న స్థానిక సీఐ రమేష్ పట్టణంలో ట్రాఫిక్, త్రిబుల్ రైడింగ్ వంటి అంశాల నియంత్రణకు పోలీస్ శాఖకు పాలకవర్గం సహకరించాలని కోరారు. సమావేశంలో వైస్ చైర్‌పర్సన్ ఉమ, కౌన్సిలర్లు, కో–ఆప్షన్ సభ్యులు, వివిధ శాఖల అదికారులు పాల్గొన్నారు.


