ఆర్‌ఎంపీలకు పద్మశాలీ సమాజం సన్మానం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఆర్‌ఎంపీలు పేద ప్రజలకు సేవలందించాలని పద్మశాలీ సంఘం అధ్యక్షుడు కాముని రాజేశం, సిద్దిపేట ఆర్‌ఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ముదిగొండ శ్రీనివాస్ అన్నారు. పట్టణ పద్మశాలీ సమాజం ఆధ్వర్యంలో సోమవారం పద్మశాలీ ఆర్‌ఎంపీలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్‌ఎంపీలు వృత్తిలో సమాజాభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సిరిగాది బాల్‌రాజు, ఉపాధ్యక్షుడు శ్రీహరి, కోశాధికారి సూరం ప్రసాద్, సహాయ కార్యదర్శి రవితేజ, సహాయ కార్యదర్శి చిలుక ఆంజనేయులు, కార్యవర్గ సభ్యులు పెద్ద శ్రీనివాస్, ఆడేపు నాగరాజు, సిరిమల్లె సునీత తదితరులు పాల్గొన్నారు.


