ఊడలమర్రి నీడలో..
వర్గల్(గజ్వేల్): గురుకుల విద్యాలయంలో నిత్యం చదువులతో కుస్తీపట్టే వర్గల్ నవోదయ విద్యార్థులు మంగళవారం ఊడలమర్రి నీడలో..ఉయ్యాల జంపాలలు ఊగుతూ సందడి చేశారు. రిఫ్రెష్‌మెంట్ కోసం ప్రిన్సిపాల్, అధ్యాపకులతో కలిసి విద్యాలయ సమీపంలోని అవుసులోనిపల్లి పల్లెప్రకృతి వనం చేరుకున్నారు. ప్రకృతిసిద్ధంగా రూపుదిద్దుకున్న మర్రి ఊడలు, చెట్టుకొమ్మలపై గెంతుతూ, ఆటపాటలతో కేరింతలు కొట్టారు. ఫొటోలు దిగారు. ఆనందోత్సాహాల మధ్య గడిపి నూతనోత్సాహం పొందారు. అక్కడే వనభోజనం చేసి విద్యాలయానికి చేరుకున్నారు.
నవోదయ విద్యార్థుల సందడి
ఊడలమర్రి నీడలో..


