సీఎం సారూ.. ఇటు చూడరూ... | - | Sakshi
Sakshi News home page

సీఎం సారూ.. ఇటు చూడరూ...

Dec 3 2025 10:10 AM | Updated on Dec 3 2025 10:10 AM

సీఎం

సీఎం సారూ.. ఇటు చూడరూ...

అర్ధంతరంగా నిలిచిన అభివృద్ధి పనులు
నిధుల వరద పారేనా? ● కోటి ఆశలతో ప్రజలు నేడు జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి రాక
ప్రాజెక్టులు పూర్తిచేయరూ..

గౌరవెల్లి, గండిపెల్లిపై

రైతుల కోటి ఆశలు

హుస్నాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మొదటి సారిగా హుస్నాబాద్‌కు వస్తుండటంతో రైతులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి వరాల జల్లు కురిపిస్తారన్న ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి ఈ ప్రాంతంలో పాదయాత్ర చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. 2007లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టులు 70 శాతం మేర పనులు పూర్తి చేశారు. తర్వాత వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ప్రాజెక్టుల రీ డిజైన్‌లో భాగంగా గౌరవెల్లి ప్రాజెక్టు 8.23 టీఎంసీలు, గండిపల్లి ప్రాజెక్టు 1.15 టీఎంసీల సామర్థ్యానికి పెంచారు. ప్రస్తుతం గౌరవెల్లి ప్రాజెక్టు 90 శాతం పూర్తయి ట్రయల్‌ రన్‌ చేశారు. కాలువలు నిర్మించాల్సి ఉంది. దశాబ్ధ కాలంగా సాగునీటి ప్రాజెక్టుల కోసం ఈ ప్రాంత ప్రజలు కళ్లల్లో వత్తులు వేసుకొని ఎదురు చేస్తున్నారు.

సిద్దిపేటలో చేపట్టిన వెయ్యి పడకల ప్రభుత్వ ఆస్పత్రి భవన నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో రోగులకు పూర్తి స్థాయిలో వైద్యసేవలు అందడం లేదు. సిద్దిపేట అర్బన్‌ మండలం ఎన్సాన్‌పల్లి శివారులో రూ.324కోట్ల వ్యయంతో 2020 డిసెంబర్‌లో అప్పటి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వంలో పనులు జోరుగా సాగినా.. రెండేళ్లుగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. దాదాపు 90శాతం పనులు పూర్తి అయ్యాయి. మిగిలిన పనులకు నిధుల కొరత అడ్డంకిగా మారింది. ఆస్పత్రి పూర్తి అయితే సిద్దిపేట, మెదక్‌, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే మరిన్ని మెడికల్‌ పీజీ సీట్లు, అలాగే ఎంబీబీఎస్‌ సీట్లు సైతం పెరగనున్నాయి. దాదాపు మరో రూ.50కోట్లకు పైగా నిధులు కేటాయించి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే కరీంనగర్‌ రోడ్‌లో నిర్మిస్తున్న నర్సింగ్‌ కళాశాల పనులు సైతం నిధులు లేక నిలిచిపోయాయి.

తలాపున నీళ్లున్నా..

తలాపునే రిజర్వాయర్‌ ఉన్నా.. దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు నీరు అందడంలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా తొగుటలో 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ను నిర్మించారు. రిజర్వాయర్‌ పూరై నాలుగేళ్లు గడుస్తున్నా ఇంకా కాలువల నిర్మాణం పూర్తి కాలేదు. డిస్ట్రిబ్యూషన్‌ కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో దుబ్బాక నియోజకవర్గంలోని రైతులకు సాగు నీరు అందక ఇబ్బంది పడుతున్నారు.

సిద్దిపేటలో

వెయ్యి పడకల ఆస్పత్రి

నిర్మాణం

ప్రజాపాలన విజయోత్సవ సభకు సర్వం సిద్ధం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి మొదటి సారిగా బుధవారం హుస్నాబాద్‌కు వస్తుండటంతో మంత్రి పొన్నం ప్రభాకర్‌ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. వీఐపీలకు, మహిళలకు, దివ్యాంగులకు ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. సభా వేదిక వెనుక భాగంలో హెలిప్యాడ్‌ నిర్మించారు. సభ ప్రాంగణంలోనే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.

ఇంకా పూర్తికాని శిల్పారామం..

జిల్లాలో పలు అభివృద్ధి పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. వెయ్యి పడకల ఆస్పత్రి, పర్యాటక అభివృద్ధి, కాలువల నిర్మాణం, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌, పశు వైద్య కళాశాల నిర్మాణాలు పూర్తి అయ్యేందుకు చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లయిన సందర్భంగా విజయోత్సవాలకు బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాకు రానున్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్‌, గజ్వేల్‌ నియోజకవర్గాలకు నిధులు కేటాయిస్తారని ప్రజల్లో కోటి ఆశలు నెలకొన్నాయి. – సాక్షి, సిద్దిపేట

ప్రజల విన్నపాలు..

సీఎం సభకు సర్వం సిద్ధం

గతంలో సీఎం రేవంత్‌రెడ్డి హామీ మేరకు.. హుస్నాబాద్‌ను కరీంనగర్‌లో విలీనం చేయాలి.

హుస్నాబాద్‌ ప్రాంతంలో క్రీడాకారులకు కొదవ లేదు. ఈ ప్రాంతంలో స్పోర్ట్స్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తే క్రీడాకారులు నైపుణ్యం సాధించే అవకాశం ఉంది.

నాలుగు జిల్లాల సరిహద్దులో ఉన్న హుస్నాబాద్‌కు చుట్టూ రింగ్‌ రోడ్డు నిర్మించాలి.

ఎన్నికల సమయంలో ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీ మేరకు మెడికల్‌ కళాశాలపై ప్రకటన చేయాలి.

ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశం మెండుగా ఉన్నాయి. ఏదైన పరిశ్రమ నెలకొల్పితే స్థానిక యువత ఉపాధి పొందుతారు.

హుస్నాబాద్‌లోని జనాభా దృష్ట్యా మున్సిపాలిటీని గ్రేడ్‌ 1 గా అప్‌గ్రేడ్‌ చేయాలి.

సీఎం సారూ.. ఇటు చూడరూ...1
1/4

సీఎం సారూ.. ఇటు చూడరూ...

సీఎం సారూ.. ఇటు చూడరూ...2
2/4

సీఎం సారూ.. ఇటు చూడరూ...

సీఎం సారూ.. ఇటు చూడరూ...3
3/4

సీఎం సారూ.. ఇటు చూడరూ...

సీఎం సారూ.. ఇటు చూడరూ...4
4/4

సీఎం సారూ.. ఇటు చూడరూ...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement