కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించండి
గజ్వేల్: పెండింగ్ బిల్లులు అడిగిన పాపానికి సర్పంచ్‌లను జైళ్లకు పంపిన కాంగ్రెస్‌ను ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. మంగళవారం గజ్వేల్ మండలం రిమ్మనగూడలో వివిధ పార్టీలకు చెందిన నేతలు హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసిందని వాపోయారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు నిధులు రాక, సొంత డబ్బులు ఖర్చుపెట్టుకోలేక పంచాయతీ కార్యదర్శులు సెలవులు పెట్టి వెళ్లిపోతున్నారని తెలిపారు. వీధి దీపాల నిర్వహణ కూడా సక్రమంగా లేక గ్రామాల్లో చీకట్లు అలుముకున్నాయన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్ల గ్రామాలు అధ్వానంగా మారాయని ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్‌ను ఎక్కడికక్కడా నిలదీయాలన్నారు. వృద్ధులకు నెలకు రూ.4వేల ఫించన్, కల్యాణ లక్ష్మితోపాటు తులం బంగారం హామీలు ఏమయ్యాయని ప్రశ్నించాలన్నారు. ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీటీసీల ఫోరమ్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
కుకునూరుపల్లిలో చేరికలు
కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లి మండలం రాయవరంలో కొందరు నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ అధికారం దాహం కోసం పని చేస్తున్న కాంగ్రెస్ మద్దుతు దారులను ఓడించాలన్నారు. కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఉపసర్పంచ్ గుర్ర మహేందర్‌తో పాటు కమ్మరి రవి, బక్కోళ్ల కరుణాకర్, రాజు, రంగస్వామి, అనిల్ మరి కొందరు బీఆర్‌ఎస్‌లో చేరారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు
బీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక


