వైభవంగా లక్ష పుష్పార్చన
వర్గల్(గజ్వేల్): లక్ష పుష్పార్చనతో నాచగిరి శోభిల్లింది. రంగురంగుల పూల మధ్య స్తంభోద్భవుడు భక్తజనావళికి దివ్యదర్శనమిచ్చారు. ఆలయ ముఖమండపంలో మంగళవారం ఉదయం లక్షపుష్పార్చన కొనసాగింది. భక్తులు శ్రీనృసింహ నామం స్మరిస్తూ ఒక్కొక్కటిగా పూలను సమర్పించారు. వైభవంగా సాగిన ఈ మహోత్సవంతో ఆధ్యాత్మికత వెల్లివిరియగా, ఆలయ చైర్మన్ రవీందర్‌గుప్తా, ఈఓ విజయరామారావు, ధర్మకర్తలు, భక్తజనులు పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులు పొందారు.
‘డబుల్ బెడ్రూం’
సమస్యలు పరిష్కరించండి
కాలనీవాసుల నిరసన
హుస్నాబాద్: పట్టణంలోని డబుల్ బెడ్రూం ఇళ్ల కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఆ కాలనీవాసులు డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. మున్సిపల్ అధికారులకు చెప్పుకున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. అలాగే వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్య నిర్వహణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ పనులకు నిధులు కేటాయించకపోవడంతో తామే సొంత డబ్బులు ఖర్చుచేసి ఇళ్లలో ఉంటున్నామని వాపోయారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు సుద్దాల చంద్రయ్య, మల్లికార్జున్‌రెడ్డి, వికాస్, లక్ష్మణ్, కాలనీవాసులు పాల్గొన్నారు.
బస్సులు ఆపాలి
ఆర్టీసీ డీఎంకు ఎస్‌ఎఫ్‌ఐ వినతి
సిద్దిపేటకమాన్: బస్ స్టాప్‌లో బస్సులు ఆపడం లేదని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆరోపించారు. కుకునూరుపల్లి మండల కేంద్రంలోని బస్ స్టాప్‌లో బస్సులు ఆపాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సిద్దిపేట ఆర్టీసీ డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బస్సులు నిలపకపోవడంతో సిద్దిపేటకు వచ్చే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.
కీర్తనకు ఘన సన్మానం
సిద్దిపేటకమాన్: సత్యసాయిబాబా శతజయంతి వేడుకల సందర్భంగా ఇటీవల కర్ణాటకలో జరిగిన అంతర్జాతీయ వేడుకల్లో రెండు గిన్నీస్ వరల్డ్ రికార్డులు సాధించిన సిద్దిపేటకు చెందిన యువతి కీర్తనను సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో అధ్యాపకులు మంగళవారం సన్మానించారు. ఆమె మాట్లాడుతూ ఆగస్టు 16 నుంచి నవంబర్ 23 వరకు 100 దేశాల కళాకారులు పాల్గొన్న ‘వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ’ కల్చరల్ ఫెస్టివల్ ప్రపంచంలోనే అతి దీర్ఘ సాంస్కృతికోత్సవంగా గిన్నీస్ రికార్డు సృష్టించిందన్నారు.
వైభవంగా లక్ష పుష్పార్చన
వైభవంగా లక్ష పుష్పార్చన


