క్రీడల్లోనూ సత్తాచాటాలి
సిద్దిపేటరూరల్: చదువుతో పాటు క్రీడల్లోనూ సత్తాచాటాలని, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ముందుకు సాగాలని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం పీఎంశ్రీ స్కూల్స్ జిలా స్థాయి స్పోర్ట్స్ మీట్ ను ఓల్డ్ ఎల్లంకి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈఓ హాజరై మాట్లాడారు. ప్రతి విద్యార్థి రోజులో కొంత సమయాన్ని తప్పకుండా ఆటల కోసం కేటాయించాలన్నారు. క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంచుతాయన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ సౌందర్య మాట్లాడుతూ పీఎంశ్రీ స్కూల్ స్థాయిలో మొదటిసారిగా నిర్వహిస్తున్నామని, ఈ క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో పాల్గొంటారన్నారు. మొదటి రోజు సుమారు వెయ్యి మంది విద్యార్థులు, 60 మంది వ్యాయామ ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మైనార్టీ పాఠశాల ప్రిన్సిపాల్ పరకాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో మెరవాలి
డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి
అట్టహాసంగా పీఎంశ్రీ స్పోర్ట్స్ మీట్ షురూ..


