రామాయంపేట(మెదక్): రామాయంపేట తండా శివారులో సోమవారం సాయంత్రం బోరుబండి లారీ ఢీకొని రైతు మృతి చెందాడు. వివరాలు ఇలా... మండలంలోని ఆర్ వెంకటాపూర్ గ్రామానికి చెందిన రైతు నడిపోల్ల కుర్మ రాములు(45) మోపెడ్‌పై రామాయంపేట వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న బోరు బండి లారీ ఢీకొట్టింది. రోడ్డుపైనే ధాన్యం కుప్పలుండటంతో రాములు పక్కకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో, టైర్లకింద నలిగిపోయి మృతి చెందాడు. సమాచారం అందుకున్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతునికి భార్యతోపాటు కుమారుడు, కూతురు ఉన్నారు. ఎస్‌ఐ బాల్‌రాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశాడు.


