న్యూస్‌రీల్
మూడు పాఠశాలలకు స్థలాలకేటాయింపునకే ఏడాది సమయం
మరో రెండింటి పనులుఇంకా పునాదుల దశలోనే..
వచ్చే విద్యా సంవత్సరం నాటికై నా పూర్తికాని పరిస్థితి
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం పనులు ఉమ్మడి జిల్లాలో ఇంకా పూర్తిస్థాయిలో పట్టాలెక్కడం లేదు. పలుచోట్ల ఈ పనులు ఇంకా ప్రారంభానికే నోచుకోకపోగా, పనులకు శ్రీకారం చుట్టిన చోట్ల పునాదుల దశను కూడా దాటకపోవడం గమనార్హం. వీటికి స్థలాల కేటాయింపులకే సమయం పట్టడంతో ఈ పనులు బాలారిష్టాలను దాటడం లేదు. దీంతో జూన్‌లో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం నాటికే కాదు, వచ్చే ఏడాదిలో కూడా ఈ పాఠశాలలు అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి :


