మందుబాబులకు జరిమాన | - | Sakshi
Sakshi News home page

మందుబాబులకు జరిమాన

Nov 1 2025 9:35 AM | Updated on Nov 1 2025 9:35 AM

మందుబ

మందుబాబులకు జరిమాన

మందుబాబులకు జరిమాన బెల్ట్‌ దుకాణాలపై పోలీసుల దాడి 11,500లీటర్ల మద్యం బాటిల్స్‌ సీజ్‌ హాష్‌ ఆయిల్‌ పట్టివేత

సిద్దిపేటకమాన్‌: మద్యం తాగి వాహనాలు నడిపి పట్టుబడిన వాహనదారులకు సిద్దిపేట కోర్టు జరిమాన, జైలు శిక్ష విధించింది. ట్రాఫిక్‌ సీఐ ప్రవీణ్‌కుమార్‌ వివరాల ప్రకారం... పట్టణంలోని పలు ప్రాంతాల్లో తమ సిబ్బందితో కలిసి నిర్వహించిన వాహన తనిఖీల్లో 17మంది పట్టుబడ్డారు. శుక్రవారం సిద్దిపేట కోర్టులో హాజరుపర్చగా విచారణ జరిపిన న్యాయమూర్తి రూ.1,73,000 జరిమాన, వీరిలో ఒకరికి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు సీఐ తెలిపారు.

12 లీటర్ల మద్యం స్వాధీనం

దుబ్బాకటౌన్‌: పట్టణంలో అక్రమంగా నిర్వహిస్తున్న 4 బెల్టు దుకాణాలపై శుక్రవారం పోలీసులు ఆకస్మిక దాడి చేసి 12 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో డబుల్‌ బెడ్రూం సమీపంలో రెండు, అంగడీ బజార్‌లో ఒకటి, పోస్టాఫీస్‌ సమీపంలో మరోకటి మొత్తం 4 బెల్టు దుకాణాలపై ఎస్‌ఐ కీర్తిరాజు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మద్యం బాటిళ్లను సీజ్‌ చేసి కేసులు నమోదు చేశారు. అక్రమంగా మద్యం నిల్వచేస్తే ఉపేక్షించేది లేదని ఎస్‌ఐ హెచ్చరించారు. ˘

అక్కన్నపేట(హుస్నాబాద్‌): మండల కేంద్రంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్‌ షాప్‌లో నిల్వ ఉంచిన 11,500 లీటర్ల మద్యం బాటిల్స్‌ను సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ చాతరాజు ప్రశాంత్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో అనుమతి లేకుండా బెల్ట్‌ షాపులు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అక్రమ రవాణా, నిషేధిత వస్తువులపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కంది(సంగారెడ్డి): విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న హాష్‌ ఆయిల్‌ను ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ అధికారులు పట్టుకున్నారు. శుక్రవారం సాయంత్రం కంది శంకర్‌పల్లి రోడ్డుపై సంగారెడ్డి ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ అధికారులు తనఖీలు చేపట్టారు. ఈక్రమంలో కాటేదాన్‌ కాలనీకి చెందిన అనిల్‌ కుమార్‌ 964 గ్రాముల హాష్‌ ఆయిల్‌ తో పట్టుపడ్డాడు. దీని విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందన్నారు. పట్టు బడిన అనిల్‌ కుమార్‌ గంజాయి, డ్రగ్స్‌, హాష్‌ ఆయిల్‌ రవాణా చేస్తూ గతంలో పట్టు బడిన సంఘటనలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. తనిఖీల్లో ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ సీఐలు గాంధీ నాయక్‌, వీణారెడ్డి, చంద్రశేఖర్‌, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

డీడీఎస్‌కు అవార్డు

జహీరాబాద్‌: జహీరాబాద్‌లో గల డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ (డీడీఎస్‌)కి ప్లాంట్‌ జీనోమ్‌ సేవియర్‌ కమ్యూనిటీ అవార్డు దక్కింది. 2022–23 సంవత్సరానికి గాను ఈ అవార్డును ప్రకటించారు. నవంబర్‌ 12వ తేదీన ఢిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఈ అవార్డును అందజేయనున్నారు. జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నందుకు గాను అవార్డు వరించింది.

వేపచెట్టు నరికివేత నిలిపి వేయాలి

మద్దూరు(హుస్నాబాద్‌): మండలంలోని కూటిగల్‌ గ్రామంలో బుర్జు వద్ద ఉన్న దశాబ్దాల కాలం నాటి వేపచెట్టును నరికి వేయాలనే ఆలోచనను విరమించుకోవాలని గ్రామానికి చెందిన సాంబరాజు రాజేశ్వర రావు, బండి కృష్ణ తదితరులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రజాకార్లకు వ్యతిరేకంగా కూటిగల్‌ గ్రామస్తులు చేసిన పోరాటానికి వేప చేట్టు సాక్షిగా నిలిచిందన్నారు. గ్రామస్తులకు చల్లని నీడనిస్తున్న చెట్టును విద్యుత్‌ తీగలకు అడ్డు వస్తున్నదనే సాకుతో నరికి వేసేందుకు పంచాయతీ కార్యదర్శి అనిత ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ఆమైపె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

నేల కొరిగిన వరి పంట

దుబ్బాకరూరల్‌: ఇటీవల కురిసిన వర్షాలకు వరి పంటలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. అక్బర్‌పేట– భూంపల్లి మండలంలోని నగరం గ్రామంలో దాదాపుగా ఇరవై ఎకరాల వరకు వరి పంట దెబ్బతింది. చేతికొచ్చిన పంటలు వరదనీటిలో మునిగిపోవడంతో రైతులు కన్నీంటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నారు.

మందుబాబులకు జరిమాన 
1
1/1

మందుబాబులకు జరిమాన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement