క్విజ్ పోటీల్లో విద్యార్థుల సత్తా
దుబ్బాకటౌన్: దేశ మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని రెండు రోజుల పాటు సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్ర స్థాయి క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో లచ్చపేట ఆదర్శ పాఠశాల విద్యార్థులు తృతీయ బహుమతి సాధించారని శుక్రవారం పాఠశాల ప్రిన్సిపాల్ బుచ్చిబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 44 పాఠశాలలు పాల్గొన్నాయని తెలిపారు. క్విజ్ పోటీల్లో లచ్చపేట ఆదర్శ పాఠశాల పదవ తరగతి విద్యార్థులు వర్షిత, శివ్య, స్పూర్తి, నానేశ్, యశ్వంత్ ఉత్తమ ప్రతిభ కనబర్చి, ఫైనల్లో తృతీయ స్థానం సాధించారని చెప్పారు. లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ, రాష్ట్రపతి నిలయం అధికారి డా. రజనీ ప్రియ చేతుల మీదుగా విద్యార్థులు, గైడ్ టీచర్ నాగరాజు బహుమతులు అందుకున్నారని తెలిపారు.


