నీటి బకెట్‌లో పడి చిన్నారి మృతి
చిన్నశంకరంపేట(మెదక్): నీటి బకెట్‌లో పడి 18 నెలల చిన్నారి మృతిచెందిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం మండల కేంద్రంలో జరిగింది. తెలంగాణ మోడల్ స్కూల్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్న గుది బండ స్వప్న కూతురు 18 నెలల చిన్నారి రుచిత ఇంటి వద్ద అడుకుంటుంది. అమ్మమ్మ అంజమ్మ చిన్నారిని ఆడిస్తున్న క్రమంలో అదే సమయంలో ఇంటి బయట గొడవ జరుగుతుండటంతో బయటకు వచ్చి చూసి వెళ్లేలోపే చిన్నారి బాత్రూం పక్కన ఉన్న నీటి బకెట్‌లో పడి మునిగిపోయింది. వెంటనే అస్పత్రికి తరలించంగా, అప్పటికే చిన్నారి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. అల్లారుముద్దుగా చూసుకుంటున్న పసిపాప చనిపోవడంతో తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది.
దౌల్తాబాద్(దుబ్బాక): మండల పరిధిలోని గోవిందాపూర్‌లో బైండ్ల సంకేత్ (4) అనే బాలుడు కుక్కదాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది అక్కడికి చేరుకొని ప్రఽథమ చికిత్స అందించి స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
గజ్వేల్‌రూరల్: గజ్వేల్, రాయపోల్, తొగుట పోలీస్‌స్టేషన్ల పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు శ్రీరామ్, ప్రేమ్‌దీప్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు, సిబ్బంది కలిసి ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి నుంచి 800 గ్రాముల గంజాయి, ఏడు సెల్‌ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయించినా, తాగినా చట్టపరమైన చర్యలు తప్పవని ఏసీపీ నరసింహులు పేర్కొన్నారు.
నీటి బకెట్‌లో పడి చిన్నారి మృతి


