
భూములాక్కోవడం దారుణం
కలెక్టర్‌కు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వినతి
సంగారెడ్డి: సంగారెడ్డి నియోజకవర్గంలో నెలకొన్న ప్రజాసమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్యను గురువారం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కలిశారు. బీఆర్‌ఎస్ శ్రేణులతో కలసి కలెక్టర్‌కు సమస్యలపై ఎమ్మెల్యే వినతి పత్రం అందజేశారు. కొండాపూర్ మండలం మందాపూర్, మునిదేవునిపల్లి గ్రామాల్లో పరిశ్రమల పేరుతో రైతులు సాగు చేస్తున్న భూములను ప్రభుత్వం గుంజుకోవాలని చూస్తుందని, రైతుల నుంచి భూములను లాక్కుంటే రైతులు రోడ్డున పడుతారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతల బతుకులు చిన్నాభిన్నం చేసేలా ప్రభుత్వ ప్రతిపాదనలు సరికాదన్నారు. రైతులకు నష్ట పరిహారం నిర్ధారణ చేసి ,సాగుకు అనుకూలంగా లేని భూమిని చూసుకుని పరిశ్రమలకు కేటాయించుకోవాలని సూచించారు. అలాగే నియోజకవర్గంలో పెండింగ్ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.
జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా మురళీకృష్ణ
సంగారెడ్డి: జిల్లా కేంద్ర సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌గా మురళీకృష్ణ గురువారం బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వాసుపత్రి ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా ఉన్న డాక్టర్ అనిల్‌కుమార్ ఆయనకు కేటాయించిన పోస్టులో కొనసాగనున్నారు.
ఎరువులపై అపోహలు వద్దు
ఖేడ్ ఏడీఏ నూతన్‌కుమార్
కంగ్టి(నారాయణఖేడ్): రైతులు ఎరువుల వినియోగం విషయంలో ఎలాంటి అపోహలకు గురికావద్దని అన్నీ కంపెనీల డీఏపీ ఎరువులు ఒకేవిధంగా మొక్కల ఎదుగుదలకు పనిచేస్తాయని నారాయణఖేడ్ ఏడీఏ నూతన్‌కుమార్ తెలిపారు. మండల కేంద్రం కంగ్టితోపాటు పలు గ్రామాల్లోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి రైతులకు ఎరువుల పట్ల అవగాహన కల్పించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఎరువులు అమ్మినా..అధిక ధరలకు అమ్మకాలు చేపట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని రైతులు తమకు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో రైతులు, ఏఈఓ పాల్గొన్నారు.
త్వరలో టీచర్లకు హెల్త్‌కార్డులు
పీఆర్‌టీయూ టీఎస్
రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్
కల్హేర్(నారాయణఖేడ్): ఉపాధ్యాయులకు త్వర లో ప్రభుత్వం హెల్త్‌కార్డులు అందజేస్తుందని పీఆర్‌టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కల్హేర్ మండలంలో గురువారం పీఆర్‌టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా గుండు లక్ష్మణ్ మాట్లాడుతూ... పీఆర్‌టీయూ సంఘం సమస్యల పరిష్కారం దిశగా పనిచేస్తుందన్నారు. పెండింగ్ బిల్లులు క్లియర్ అవుతాయని తెలిపారు. పీఆర్‌టీయూ సంఘం ఆశయాలకు కట్టుబడి ఉపాధ్యయులు పనిచేయాలని కోరారు. గుండు లక్ష్మణ్‌ను మార్డి, బీబీపేట్ ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు సన్మానం చేశారు.
ఆవిష్కరణలపై దృష్టి సారించాలి
గీతం సదస్సులో లెఫ్టినెంట్ జనరల్ నీరజ్
పటాన్‌చెరు: రక్షణ రంగంలో సవాళ్లను ఎదుర్కునేందుకు వివిధ ఇంజనీరింగ్ విభాగాల మధ్య సమన్వయంతో నూతన ఆవిష్కరణల పై దృష్టి సారించాలని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఎండ్ మెకానికల్ ఇంజనీరింగ్ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్సే పిలుపునిచ్చారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ‘వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో వస్తున్న ధోరణులు, ఆవిష్కరణలు’అంశంపై గురువారం నుంచి నిర్వహిస్తున్న రెండురోజుల జాతీయ సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. రక్షణ రంగంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు కొత్త సాంకేతిక అవసరమని, అందుకు వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో అంతర్గత పరి శోధనల ద్వారానే సాధ్యమవుతుందని తెలిపారు.

భూములాక్కోవడం దారుణం

భూములాక్కోవడం దారుణం

భూములాక్కోవడం దారుణం