
మహిళ అదృశ్యం
సంగారెడ్డి క్రైమ్: మతిస్థిమితం లేని మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేష్ వివరాల ప్రకారం... అందోల్ మండలం మాసన్‌పల్లి గ్రామానికి చెందిన రోయ్యల అనసూజ(50) అనారోగ్యం నిమిత్తం ఈనెల 1న ఉదయం పట్టణంలోని బాలాజీనగర్‌లో నివాసించే తన కుతురు నాగలక్ష్మి ఇంటికి వచ్చింది. అదే రోజు సాయంత్రం 5 గంటల సమయంలో పాల ప్యాకెట్ తీసుకొస్తానని ఇంట్లో చెప్పి, బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.