ప్రమాదంలో
వ్యక్తి మృతి
రామాయంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో బుధవారం జరిగింది. వివరాలు ఇలా... మండలంలోని అక్కన్నపేటకు చెందిన కొత్తేనుగు లక్ష్మీనారాయణ (55) కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం జంగంపల్లివద్ద ఉన్న ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ అక్కడే నివాసముంటున్నాడు. బుధవారం వ్యక్తిగత పనుల కోసం అక్కన్నపేట గ్రామానికి బైక్‌పై వచ్చి మధ్యాహ్నం తిరిగి వెళ్తున్న క్రమంలో బిక్కనూరు చర్చి సమీపంలో జాతీయ రహదారిపై వెనుకనుంచి కంటైనర్ ఢీకొట్టడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడు గతంలో తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు.