
జాతీయ సేవారత్న అవార్డుకు ఎంపిక
న్యాల్‌కల్(జహీరాబాద్): జాతీయ ఉత్తమ సేవా అవార్డుకు మండలంలోని రేజింతల్ గ్రామ శివారులో గల చర్చి పాస్టర్ ప్రశాంత్ బెంజిమెన్ ఎంపికయ్యాడు. బుధవారం ఈ మేరకు హైదరాబాద్‌లో అవార్డు సెలెక్షన్ కమిటీ జాతీయ చైర్మన్ నల్లా రాధాకృష్ణ ఎంపిక పత్రాన్ని ఆయనకు అందజేశారు. సెప్టెంబర్ 5వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో నిర్వహించనున్న బహుజన సాహిత్య అకాడమీ 18వ నేషనల్ కాన్ఫరెన్స్‌లో సేవారత్న అవార్డును అందజేయనున్నారు. నిస్వార్థంగా స్వచ్ఛంద సేవ, సంఘ సేవలను కుల, మతాలకు అతీతంగా అందిస్తున్నందుకు గాను ఎంపిక చేసినట్లు రాధాకృష్ణ పేర్కొన్నారు.