
రూ.4 వేలతో 4 పుణ్యక్షేత్రాల యాత్ర
డిపో మేనేజర్ రఘు
దుబ్బాకటౌన్: దుబ్బాక నుంచి అరుణాచల గిరి ప్రదర్శణకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నామని దుబ్బాక డిపో మేనేజర్ రఘు బుధవారం తెలిపారు. ఈ నెల 9న సాయంత్రం 3 గంటలకు దుబ్బాక నుంచి బస్సు బయలుదేరి కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం గిరి ప్రదర్శణాంతరం తిరుపతి దర్శణం ఉంటుందని పేర్కొన్నారు. కావున ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బస్సు టికెట్ ధర పెద్దలకు రూ.4 వేలు, పిల్లలకు రూ.2 వేలు ఉంటుందని చెప్పారు. టికెట్ బుకింగ్ కోసం 9959 226271, 7382 829973 నంబర్లకు సంప్రదించాలని కోరారు.
శ్రీనివాసమూర్తికి
డాక్టరేట్ ప్రదానం
సదాశివపేట(సంగారెడ్డి): పట్టణానికి చెందిన ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితుడు, పురోహితుడు దైవజ్ఞ శ్రీనివాసమూర్తి పంతులుకు చెన్నయ్‌కు చెందిన గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ పట్టాను ప్రదానం చేశారు. గతనెల 28న చైన్నైలోని మైలాపూర్‌లోని భారతీయ విద్యాభవన్‌లో జరిగిన సభలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల చేతుల మీదుగా శ్రీనివాసమూర్తి గౌరవ డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. 20 ఏళ్లుగా పురోహితునిగా జ్యోతిష్య, వాస్తు శాస్త్రాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలకు గాను పట్టాను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వీసీ, మాజీ జడ్జి కే.వెంకటేషన్, చీఫ్ జనరల్ మేనేజర్ హెడ్ ఆఫ్ డిపార్టుమెంట్ ఆటమిక్ ఎనర్జీ ఎన్ సెల్వరాజన్, ఇండియన్ ఆర్మీ రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ గణేషన్, ప్రముఖులు పాల్గొన్నారు.
జూదరుల అరెస్ట్
పాపన్నపేట(మెదక్): నాగ్సాన్‌పల్లి శివారులో మంగళవారం రాత్రి జూదం ఆడుతున్న 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ వివరాల ప్రకారం... విశ్వసనీయ సమాచారం మేరకు గ్రామ శివారులోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్‌పై కానిస్టేబుల్స్‌తో కలిసి దాడి చేశారు. జూదం ఆడుతున్న వారి అరెస్ట్ చేశారు. ఒకరు పారిపోయారు. వారి నుంచి రూ.74,350 నగదు, తొమ్మిది సెల్‌ఫోన్లు, రెండు కార్లు, 5 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.
మేకల దొంగలు అరెస్ట్
వర్గల్(గజ్వేల్): మేకలను అపహరిస్తున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గౌరారం ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. మల్లారెడ్డిపల్లిలో నాలుగు మేకల చోరీ కేసులో హైదరాబాద్‌కు చెందిన నీరజ్‌కుమార్, నరేష్‌కుమార్, మాఖన్ విశాల్‌సింగ్‌లు మూడు నెలల క్రితం అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించగా, ఇదే కేసులో మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం వర్గల్ కమాన్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా హైదరాబాద్‌కు చెందిన సూర్యవంశీ రాహుల్, ధరంకార్ గోపాలకృష్ణ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించారు. మేకల షెడ్‌లను వెతికేందుకు గౌరారం వచ్చినట్లు, గౌరారంతో పాటు తొగుట పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో మేకలను దొంగిలించినట్లు అంగీకరించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు పంపించారు.

రూ.4 వేలతో 4 పుణ్యక్షేత్రాల యాత్ర