
అదనపు పీపీగా చంద్రశేఖర్ పటేల్
నారాయణఖేడ్: సంగారెడ్డి సివిల్ జడ్జీ– సహాయ సెషన్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కంగ్టి మండలం సిద్దంగిర్గా గ్రామానికి చెందిన న్యాయవాది చంద్రశేఖర్ పటేల్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ పటేల్ జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్‌ను ఆయన స్వగృహంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి మిఠాయి తినిపించారు. ప్రతిగా ఆయనను ఎంపీ సన్మానించి న్యాయవ్యవస్థలో న్యాయబద్ధత, ప్రజాసేవ ధ్యేయంగా సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ కో–ఆప్షన్ సభ్యులు రషీద్, ఖేడ్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తాహెర్‌అలీ, సిర్గాపూర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నగేశ్‌చారి, నాయకులు కల్లయ్యస్వామి, శుక్లవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
పెండింగ్ వేతనం చెల్లించాలి
వైద్య ఆరోగ్య శాఖ ఏఓకు వినతి
సంగారెడ్డి: జిల్లాలో ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తోన్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న 2 నెలల వేతనాలు విడుదల చేయాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం సీఐటీయూ నాయకులు స్థానిక డీఎంఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఏవో శ్రీవాణికి గురువారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మెడికల్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం.యాదగిరి మాట్లాడుతూ...ఎన్‌హెచ్‌ఎం పరిధిలో పని చేస్తున్న అర్బన్‌హెల్త్, ఏఎన్‌ఎం, స్టాఫ్‌నర్స్, ల్యాబ్ టెక్నీషియన్లు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గత 2 నెలల నుంచి పెండింగ్‌లో ఉన్న వేతనాలు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఉద్యోగులందరికీ 2 నెలల వేతనం పీఆర్సీ, ఏరియర్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు రాజు, కోశాధికారి ఇమ్రాన్, ఉపాధ్యక్షుడు రాము, నాయకులు విజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ గ్యారేజ్ సిబ్బందికి శిక్షణ
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ ఆర్టీసీడిపోలో గ్యారేజ్ సిబ్బందికి గురువారం శిక్షణ తరగతులు నిర్వహించారు. డిపో మేనేజర్ టి.స్వామి సిబ్బంది పలు సూచనలు సలహాలు అందించారు. మెరుగైన నిర్వహణ పద్ధతులు, సురక్షిత డ్రైవింగ్ కోసం అవసరమైన యాంత్రిక అవగాహన, వాటి నిర్వహణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ స్వామి మాట్లాడుతూ...శిక్షణ తరగతులు నైపుణ్యాలను పెంచేందుకు, సిబ్బంది పనితీరు మెరుగుపరిచేందుకు సహాయపడుతుందన్నారు. ఈ సందర్భంగా సిబ్బంది అనుమానాలను ఆయన నివృతి చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ తిరుమలేశ్ తదితరులు పాల్గొన్నారు.
నేడు జగన్నాథ రథయాత్ర
సదాశివపేట(సంగారెడ్డి): సదాశివపేట ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్రను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇస్కాన్ ప్రతినిధులు శ్రీరామదాసు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. మధ్యాహ్నం రెండు గంటలకు దుర్గమ్మ మందిరం నుంచి బయల్దేరి శాస్త్రిరోడ్, బస్టాండ్, సుభాష్‌రోడ్, గాంధీచౌక్ మీదుగా సాయంత్రం 6 గంటలకు బసవసేవాసదన్ చేరుతుందని తెలిపారు. భక్తులు జగన్నా థ రథాన్ని లాగి దర్శించుకోవాలని కోరారు. రాత్రి 10 గంటల వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

అదనపు పీపీగా చంద్రశేఖర్ పటేల్

అదనపు పీపీగా చంద్రశేఖర్ పటేల్