
డీఎన్‌ఏ ద్వారా 11 మంది గుర్తింపు
ఒకరిని బిహార్‌కు చెందిన కుటుంబ సభ్యులకు అప్పగింత
పటాన్‌చెరు టౌన్: సిగాచీ పరిశ్రమలో జరిగిన పేలుడు ప్రమాదంలో మరణించి గుర్తుపట్టలేని స్థితిలో పటాన్‌చెరు మార్చురీలో ఉన్న మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షల ద్వారా 11 మందిని గుర్తించారు. డీఎన్‌ఏ పరీక్ష నివేదికలు వచ్చిన 11 మృతదేహాలకు సంబంధించిన కుటుంబ సభ్యులకు అధికారులు ఇప్పటికే సమాచారం అందించారు. అందులో బిహార్‌కు చెందిన పూజా కుమారికి తన భర్త నాగ పాశ్వాన్ (29) మృతదేహాన్ని గుర్తించి అప్పగించారు. అదేవిధంగా తక్షణ సహాయం కింద రూ.లక్ష అందజేశారు. నాగపాశ్వాన్ మృతదేహాన్ని అంబులెన్స్ ద్వారా బిహార్‌కు పంపించే ఏర్పాట్లు చేశారు.