మత్స్యకార మణిహారం..
గూగుల్ వారి ‘మైక్రో లెర్నింగ్’..
కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపికైన ప్రసాద్ సూరి ‘సాక్షి’తో పంచుకున్న ముచ్చట్లు..
– వివరాలు ఫ్యామిలీ యువర్స్‌లో
మార్చురీ వద్ద పడిగాపులు
● తమవారి కోసం బాధితుల ఆక్రందన ● నాలుగు రోజులైనా మారని పరిస్థితి
సంవత్సరాలు కాదు.. నెలలు కాదు.. జస్ట్ నిమిషాల్లో చేసే గూగుల్ కోర్సుల వివరాల సమాహారం..
– వివరాలు ఫ్యామిలీ యువర్స్‌లో
మనిషి ఎలాగూ ప్రాణాలతో దక్కలేదు ఆఖరి చూపుకోసం కనీసం తమవారి మృత
దేహమైనా దొరుకుంతుందో లేదోనన్న
ఆందోళన సిగాచీ ఘటన బాధిత కుటుంబీకుల్లో వ్యక్తమవుతోంది. ప్రమాదం జరిగి నాలుగు రోజులవుతున్నా బాధిత కుటుంబాల్లో ఆవేదన అణుమాత్రం తగ్గలేదు. తమ వారి మృతదేహాలను ఇస్తే తీసుకెళ్లేందుకు కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. ఇక ఆచూకీ తెలియని వారికోసం శవాగారం వద్ద నిద్రాహారాలు మాని ఆతృతగా పడిగాపులు కాస్తున్నారు. మార్చురీ వద్ద ఎవరిని కదిలించినా మనిషిని కోల్పోయామన్న పుట్టెడు దుఃఖం వారిని నిలువెల్లా
కంపించివేస్తోంది. గురువారం పటాన్ చెరు మార్చురీ వద్ద కనిపించిన దృశ్యాలు.
పటాన్‌చెరు/రామచంద్రాపురం(పటాన్‌చెరు)/పటాన్‌చెరు టౌన్: ఓవైపు ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షం మరోవైపు తిండీతిప్పలు లేకుండా రోదనలతో మనోవేదనతో మార్చురీ వద్ద వారు ఎదురుచూస్తూ కనిపించడం అందరినీ కలచివేస్తోంది. డీఎన్‌ఏ పరీక్షలు తర్వాతనే మృతదేహాలను తీసుకువెళ్లే పరిస్థితి నెలకొంది. రక్త పరీక్షలు ఇచ్చి డీఎన్‌ఏ ఫలితాల కోసం కుటుంబీకులు ఇటు మార్చురీ వద్ద ఆటో హెల్త్ సెంటర్ వద్ద ఎదురుచూస్తున్నారు. ఎవరైనా వారిని పలకరిస్తే కన్నీటి పర్యంతమై గద్గద స్వరంతో తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. కనీసం తమవారి మృతదేహాలైనా దొరుకుతాయో లేదోనని అనుమానం వ్యక్తం చేస్తుస్తున్నారు.
అల్లుడి మృతదేహం కోసం మామ
ఉత్తరప్రదేశ్ చెందిన రాంజీ అవన్ తన అల్లుడు విజయ్‌కుమార్ కోసం మూడు రోజులుగా ఎదురు చూస్తున్నారు. తన కూతుర్ని రాంజీకి ఇచ్చి పెళ్లి చేశానని ఆయన సిగాచీలో పనిచేసేవాడని వివరించారు. అల్లుడి మృతదేహం లభిస్తే తీసుకువెళ్లాలని ఎదురుచూస్తున్నానని వివరించారు. అల్లుడు మృతదేహం కోసం తన ఇంటి వద్ద బంధువులందరూ ఎదురుచూస్తున్నారని వాపోయారు.
లభించని సీనియర్ మేనేజర్ మృతదేహం
సిగాచీ పరిశ్రమల సీనియర్ మేనేజర్‌గా పనిచేసిన రవి మృతదేహం ఇంతవరకు లభించలేదు. మృతదేహం కోసం బంధువుల రోదనలు మిన్నంటుతున్నాయి. ఇస్నాపూర్‌లో స్థిరపడిన రవి కుటుంబం దుర్ఘటన జరిగినప్పట్నుంచీ ప్రతీరోజు మార్చురీ వద్దకు వచ్చి ఎదురుచూస్తున్నారు. రవి గతంలో ఈ పరిశ్రమలో పనిచేసి మానేసి మూడు నెలల క్రితమే చేరాడు.
డీఎన్‌ఏ ఫలితం కోసం ఎదురుచూపులు
సిగాచీలో పని చేసిన కార్మికుడు చోటేలాల్ కోల్ మృతదేహం కోసం ఆయన భార్య సంజు దేవి ఎదురుచూస్తున్నారు. తన భర్త కోసం ఆస్పత్రులు చుట్టూ తిరిగారు. 90% కాలిపోయిన ఒక వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనే వీడియోను చూసి అక్కడికి వెళ్లి చూసింది. కానీ, ఆమె ఆశ నిరాశే అయింది. ఆ వ్యక్తి ఆమె భర్త కాదని పోలీసులకు చెప్పింది. మార్చురీ వద్ద డీఎన్‌ఏ పరీక్షలు చేయించుకుని ఫలితాల కోసం రెండు రోజులుగా ఎదురుచూస్తోంది.
తనయుడి కోసం తల కొట్టుకుని..
కాళ్లు మొక్కుతా నా కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్పండి అని తండ్రి రాందాస్ పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ పరిశ్రమ ఎదుట తన తలను బండకు బాదుకున్నాడు. దీంతో వెంటనే పోలీసులు, వైద్య సిబ్బంది బాధితుడికి ప్రథమ చికిత్స చేశారు. తన కుమారుడి పేరు జస్టిన్ అని బండ్లగూడలో ఉంటామని తన కొడుకు సోమవారం ఉదయం డ్యూటీకి వచ్చాడని చెప్పాడు. పరిశ్రమలో ప్రమాదం జరిగిన రోజు నుంచి వెతుకుతున్నా కొడుకు ఆచూకీ మాత్రం దొరకడం లేదన్నారు. అధికారులు, నాయకులు తమ కుమారుడు ఎక్కడ ఉన్నాడో చెప్పాలని ఆయన కన్నీరు పెట్టుకున్నారు.
శవమైనా దొరుకుతుందో లేదో..!
శవమైనా దొరుకుతుందో లేదో..!
శవమైనా దొరుకుతుందో లేదో..!
శవమైనా దొరుకుతుందో లేదో..!
శవమైనా దొరుకుతుందో లేదో..!
శవమైనా దొరుకుతుందో లేదో..!
శవమైనా దొరుకుతుందో లేదో..!
శవమైనా దొరుకుతుందో లేదో..!
శవమైనా దొరుకుతుందో లేదో..!