
సబ్సిడీ కందుల బ్యాగులు పంపిణీ
హుస్నాబాద్: వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. బుధవారం పట్టణంలోని రైతు వేదికలో సబ్సిడీపై కందుల బ్యాగులను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందుల సాగు చేయడం వల్ల ఎకరానికి 6క్వింటాళ్ల పైగా దిగుబడి వస్తుందన్నారు. మార్కెట్‌లో పప్పు దినుసులకు డిమాండ్ ఎక్కువగా ఉందని తెలిపారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తుందన్నారు. అలాగే ఈ ప్రాంతంలో భూములు ఎక్కువగా ఉన్న రైతులు ఆయిల్ పామ్‌ను సాగు చేయాలని సూచించారు. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు తీసుకొని వరికి ప్రత్యామ్నాయంగా లాభభసాటి పంటలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, వైస్ చెర్మన్ చందు, డైరెక్టర్లు యాదవ రెడ్డి, బిక్యానాయక్, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.