
ఉత్సాహంగా స్విమ్మింగ్ పోటీలు
రాష్ట్ర స్థాయి పోటీలకు పలువురి ఎంపిక
సిద్దిపేటజోన్: జిల్లా స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న స్టేడియంలోని స్విమ్మింగ్ పూల్‌లో మంగళవారం వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. 5 నుంచి 16 ఏండ్ల లోపు ఉన్న బాలబాలికలు పోటీల్లో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన 130మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఫ్రీ స్టైల్, బ్యాక్ స్ట్రోక్, బటర్ ఫ్లై అంశాల్లో పోటీలు జరిగాయి. పోటీలను మాజీ జెడ్పీటీసీ కొండల్ రెడ్డి, జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లికార్జున్, సిటిజన్ క్లబ్ అధ్యక్షుడు రమేష్ ప్రారంభించారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ప్రతిభ చూపిన వారు త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. పోటీలను ప్రవీణ్ తదితరులు పర్యవేక్షించారు.