ఉపాధి పనుల్లో అక్రమాలు | - | Sakshi
Sakshi News home page

ఉపాధి పనుల్లో అక్రమాలు

Jun 16 2024 10:44 AM | Updated on Jun 16 2024 10:44 AM

ఉపాధి పనుల్లో అక్రమాలు

ఉపాధి పనుల్లో అక్రమాలు

నంగునూరు(సిద్దిపేట): ఉపాధిహామీ పనుల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీడీ శివాజీ హెచ్చరించారు. శనివారం ఆయన మాట్లాడుతూ నంగునూరు మండలంలో 2023–24 సంవత్సరానికి గాను రూ.7,49,1,708 కోట్ల పనులు జరిగాయని, పనుల్లో పలు అవకతవకలు జరిగినట్లు తేలడంతో రూ.1,24,190 రికవరీకి ఆదేశించామన్నారు. ప్రతి కూలీకి పనికల్పించి మస్టర్లను సక్రమంగా ఎంట్రీ చేయాలని ఆదేశించారు. మొక్కలను విద్యుత్‌ తీగల కింద నాటుతున్నారని పలు ఫిర్యాదులు అందాయని ముందుగా లొకేషన్‌ షేర్‌ చేసిన తరువాత మొక్కలను నాటాలని టీఏ, ఎఫ్‌ఏలకు సూచించారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీఆర్‌డీఓ బాలకృష్ణ, అడిషనల్‌ జిల్లా విజిలెన్స్‌ అధికారి ప్రభాకర్‌, ఎస్‌ఆర్‌పీలు రవి, జీవన్‌, ఎంపీడీఓ వేణుగోపాల్‌, ఇంజనీర్‌ విభాగం కన్సల్టెంట్‌ శ్రీనివాస్‌, పీఆర్‌ ఏఈ శశాంక్‌ గణేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

రూ.1.24లక్షలు రికవరికీ ఆదేశం

కఠిన చర్యలు తీసుకుంటాం: ఏపీడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement