మాటామాటా పెరిగింది | - | Sakshi
Sakshi News home page

మాటామాటా పెరిగింది

May 12 2026 6:24 AM | Updated on May 12 2026 6:24 AM

మర్డర్‌కు దారి తీసింది

యువకుడి హత్య కేసులో

ముగ్గురు నిందితుల అరెస్ట్‌

పహాడీషరీఫ్‌: యువకుడి హత్య కేసులో ముగ్గురు నిందితులను బాలాపూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. ఆదిబట్ల ఏసీపీ ప్రదీప్‌ కుమార్‌ రెడ్డి, బాలాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఆదిత్‌ పాండే (24) కుర్మల్‌ గూడలో నివాసం ఉంటూ వాహనాల రికవరీ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. ఆ రాష్ట్రానికే చెందిన మున్నా అలియాస్‌ సయ్యద్‌ ఇఫ్తేకార్‌ (25) కూడా ఇదే వృత్తి కొనసాగిస్తున్నాడు. ఒకే ప్రాంతంలో ఇద్దరం పని చేయకూడదంటూ ఇద్దరి మధ్య కొన్ని రోజులుగా గొడవలు నెలకొన్నాయి. శనివారం అర్ధరాత్రి అనంతరం మాట్లాడుకుందామంటూ మున్నా తన అనుచరులు మహ్మద్‌ సాహిల్‌ (20), అబ్దుల్లా బిన్‌ ఆమెర్‌ (20)తో కలిసి పాండేను పిలిచి మద్యం మత్తులో ఉస్మాన్‌నగర్‌కు రప్పించాడు. అక్కడ మాటామాటా పెరిగి పాండేను గ్రానైట్‌ రాళ్లు, ఇనుప రాడ్‌తో హత్య చేశారు. నిందితుల నుంచి సెల్‌ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement