సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి | - | Sakshi
Sakshi News home page

సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి

May 12 2026 6:18 AM | Updated on May 12 2026 6:18 AM

బీన్స్‌ @ రూ.145

ఇబ్రహీంపట్నం రూరల్‌: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) చంద్రారెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణిలో వివిధ ప్రాంతా ల నుంచి విచ్చేసిన ప్రజల నుంచి నేరుగా అర్జీ లు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజావాణి కార్యక్రమంలో ప్రజ లు అందించే వినతులను సంబంధిత శాఖ ల అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్‌లో పెట్టకూడదని సూచించారు.ఈ వారం 85 ఫిర్యా దు లు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో వివి ధ శాఖల అధికారులు, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు తీసుకోండి

ఆమనగల్లు: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు చేరాలని మున్సిపల్‌ కమిషనర్‌ రాఘవేందర్‌రెడ్డి కోరారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా సోమవారం కళాశాలలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ శ్రీపాద శర్వాణి, లెక్చరర్లు పాల్గొన్నారు.

హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌కు దరఖాస్తుల ఆహ్వానం

ఇబ్రహీంపట్నం రూరల్‌: హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ రామంతాపూర్‌, బేగంపేటలో 1వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కలెక్టర్‌ నారాయణరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లంబాడ–4, ఎరుకల –1, ఇతర గిరిజన తెగలు–1 (బాలురు 3, బాలికలు 3) చొప్పున ఖాళీలు ఉన్నట్టు తెలిపారు. రంగారెడ్డి జిల్లాకు చెందినవారై ఉండాలని, తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు లోపు ఉండాలన్నారు. కులం, ఆదాయం, నివాస, జనన ధ్రువీకరణ పత్రాలు జతపర్చాలని చెప్పారు. ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు కలక్టరేట్‌లోని జిల్లా గిరిజనాభివృద్ధి కార్యాలయంలో దరఖాస్తులు లభిస్తాయన్నారు. అభ్యర్థి 1 జూన్‌ 2019 నుంచి 31 మే 2020 మధ్య కాలంలో జన్మించి ఉండాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులు గిరిజనాభివృద్ధి కార్యాలయంలో ఈ నెల 18 సాయంత్రం 5 గంటల లోపు పంపించాలన్నారు. ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటలకు లాటరీ విధానం ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుందన్నారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

మహిళలకు స్వయం

ఉపాధిలో శిక్షణ

మొయినాబాద్‌:జిల్లాలోని గ్రామీణ ప్రాంత మ హిళలకు స్వయం ఉపాధి రంగాల్లో ఉచిత శిక్ష ణ ఇవ్వనున్నట్లు ఎస్‌బీఐ ఆర్‌సెటీ డైరెక్టర్‌ మ హ్మద్‌ అలీఖాన్‌ సోమవారం ఒక ప్రకటనలో పే ర్కొన్నారు. మున్సిపల్‌ పరిధిలోని చిలుకూరు లో ఉన్న ఎస్‌బీఐ ఆర్‌సెటీ కేంద్రంలో నెల రో జుల పాటు మగ్గం వర్క్స్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. 18–50 సంవత్సరాల వ యసు ఉండి పదో తరగతి చదివిన మహిళలు మంగళవారం దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుకు ఎస్‌ఎస్‌సీ మెమో,రేషన్‌కార్డ్‌, ఆధా ర్‌ కార్డ్‌, బ్యాంక్‌ పాస్‌బుక్‌ జిరాక్స్‌ కాపీలు, 4 పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు జతచేయాలన్నారు. శిక్షణ కాలంలో ఉచిత హాస్టల్‌ వసతి, భోజన సౌకర్యంతోపాటు యూనిఫాం,టూల్‌కిట్స్‌ అందజేస్తామన్నారు. వివరాలకు 850016 5190 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

సనత్‌నగర్‌: బీన్స్‌ ధర ౖపైపెకి ఎగబాకింది. రైతుబజార్‌లోనే కిలో రూ.145 ఉండగా, బహిరంగ మార్కెట్‌లో రూ.180–200 వరకు పలుకుతోంది. వెజ్‌ బిర్యానీలో ప్రధానంగా ఉపయోగించే బీన్స్‌ ధర అమాంతం పెరగడంతో అటు హోట ళ్ల యజమానులు, ఇటు గృహ నివాసితులు కొనాలంటే ఒకింత ఆలోచనలో పడుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్లుగా దిగుబడి రాకపోవడంతో వ్యాపారులు ధరను భారీగా పెంచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement