యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం

May 12 2026 6:18 AM | Updated on May 12 2026 6:18 AM

ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు సరూర్‌నగర్‌లో మెగా జాబ్‌మేళా భారీగా తరలివచ్చిన అభ్యర్థులు 779 మందికి నియామక పత్రాలు

హుడాకాంప్లెక్స్‌: యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నా. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం వేదికగా నిర్వ హించిన మెగా జాబ్‌మేళాను ఆయన ప్రా రంభించారు. 123 కంపెనీలు ఈ మేళాలో పాల్గొన్నాయి. 4,318 మంది ఆన్‌లైన్‌లో పేర్లు నమో దు చేసుకున్నారు. రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌, హైదరాబాద్‌ జిల్లాలకు చెందిన సుమారు 3,716 మంది నిరుద్యోగులు హాజ రయ్యారు. వీరిలో 1,645 మందిని షార్ట్‌లిస్ట్‌ చేసి 779 మందికి ఆయా కంపెనీలు ఆఫర్‌ లెటర్లు ఇచ్చాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం సాధ్యం కాదన్నారు. ప్రైవేటు ఫార్మా, ఉత్పత్తి రంగాల్లో అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. కంపెనీల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన డీఈఈటీ నిరుద్యోగులు, పరిశ్రమలకు మధ్య వారధిగా పని చేస్తుందని చెప్పారు. కంపెనీల్లో ఖాళీల సమాచారాన్ని యువతకు చేరవేసి, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో తోడ్పడుతుందన్నారు. కలెక్టర్‌ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. స్కిల్‌ వర్సిటీ ద్వారా యువతకు నాణ్యమైన విద్యను అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ కె.కిరణ్మయి, రాష్ట్ర రోడ్లు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్‌రెడ్డి రాంరెడ్డి, టీయూఎఫ్‌ఐడీసీ చైర్మన్‌ చల్లా నరసింహారెడ్డి, ఉమ్మడి జిల్లాల పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్లు శ్రీలక్ష్మి, వినయ్‌కుమార్‌, మహేశ్‌, డీఈఈటీ డైరెక్టర్‌ జె.రాజేశ్వర్‌రెడ్డి, టాస్క్‌ సీఈఓ నితిన్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement