రైతులను ఇబ్బంది పెట్టొద్దు | - | Sakshi
Sakshi News home page

రైతులను ఇబ్బంది పెట్టొద్దు

May 12 2026 6:18 AM | Updated on May 12 2026 6:18 AM

సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

ఇబ్రహీంపట్నం రూరల్‌: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, రైతులను ఇబ్బంది పెట్టొద్దని సీపీఎం జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ప్రజా సంఘాల నాయకులతో కలిసి ధర్నా చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య మాట్లాడుతూ.. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలుకు కిలోన్నర తరగు తీస్తామని చెప్పి నాలుగు కిలోలు తీస్తున్నారని మండిపడ్డారు. రైస్‌మిల్లర్ల యాజమాన్యం 4 కిలోల తరుగు తీస్తున్నారని, 8 కిలోల తరుగు పేరుతో దోపిడీ కొనసాగుతోందన్నారు. ఈ దోపిడీని అరికట్టాలని డిమాండ్‌ చేశారు. తేమ పేరుతో రోజుల తరబడి వడ్లను ఆరబోసే విధానానికి స్వస్తి చెప్పి కొనుగోలు సెంటర్లకు వచ్చిన ధాన్యాన్ని తూకం వేసి రైస్‌ మిల్లర్లకు తరలించాలన్నారు. కొలతలు వేసిన ధాన్యానికి వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయాలని చెప్పారు. గన్నీ బ్యాగులను రైతులకు అందుబాటులో ఉంచాలని, వడ్లు ఆరబోయడానికి పడాలు ఉచితంగా ఇవ్వాలని, కొనుగోలు కేంద్రా ల్లో టెంట్లు వేసి నీడ సౌకర్యం కల్పించాలని కోరా రు. ఎండల్లో పని చేసే రైతులకు మంచినీరు, మజ్జి గ, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు సరఫరా చేయాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డికి వినతిప త్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్య దర్శి వర్గ సభ్యులు సామేలు, రాంచందర్‌, కాడిగళ్ల భాస్కర్‌, జగదీష్‌, చంద్రమోహన్‌, కందుకూరి జగన్‌, నర్సింహ, కవిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement