సాక్షి, సిటీబ్యూరో: టెక్నాలజీకి అనుగుణంగా ఉద్యోగులు విధుల్లో మార్పులకు శ్రీకారం చుట్టాలని ఎకై ్సజ్‌శాఖ రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్ సూచించారు. ఆబ్కారీ భవన్‌లో సోమవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రంగారెడ్డి ఎకై ్సజ్ డివిజన్‌లోని శంషాబాద్, సరూర్‌నగర్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్ ఎకై ్సజ్ జిల్లాల్లో అవసరమైన మార్పులకు అందరూ సిద్ధం కావాలని కోరారు. రెవెన్యూ పెంచాలని, పెండింగ్ బకాయిలను వసూలు చేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి సత్ఫలితాలను సాధించాలన్నారు. గతంలో సారా పైనే ఎక్కువ దృష్టి సారించాల్సి వచ్చేదని, ప్రస్తుతం గంజాయి, డ్రగ్స్ నియంత్రణ కోసం విస్తృతంగాపని చేయాల్సి వస్తోందన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్, డీటీఎఫ్ టీమ్‌లు బాగా పని చేయాలన్నారు. సమావేశంలో శంషాబాద్, సరూర్‌నగర్, మేడ్చల్, మాల్కాజిగిరి, వికారాబాద్ ఎకై ్సజ్ సూపరింటెండ్‌లు కృష్ణప్రియ, ఉజ్వల రెడ్డి, ఫయాజొద్దీన్, నవీన్, విజయ భాస్కర్ గౌడ్, ఏఈఎస్‌లు, సీఐలు తదితరులు పాల్గొన్నారు.


