నేడే మెగా జాబ్‌మేళా | - | Sakshi
Sakshi News home page

నేడే మెగా జాబ్‌మేళా

May 11 2026 9:55 AM | Updated on May 11 2026 9:55 AM

సరూర్‌నగర్‌ స్టేడియంలో భారీగా ఏర్పాట్లు

పాల్గొననున్న 150 కంపెనీలు

హుడాకాంప్లెక్స్‌: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ప్రజా పాలన–ప్రగతి పణాళిక’99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం 9 గంటలకు సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం వేదికగా భారీ జాబ్‌మేళాను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌ జిల్లాలకు చెందిన సుమారు 150 కంపెనీలు ఈ జాబ్‌మేళాలో పాల్గొననున్నాయి. జాబ్‌మేళాలో భాగంగా స్టాళ్లను ఏర్పాటు చేయనున్నాయి. ఇండస్ట్రియల్‌, ఫార్మా, రిటైల్‌, బ్యాకింగ్‌, ఫైనాన్స్‌, మార్కెటింగ్‌, సేవా రంగాలకు సంబంధించి న కంపెనీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఈ వేదికగా భర్తీ చేసుకునే అవకాశం ఉంది. ఎంపికై న అభ్యర్థులకు ఉపాధితో పాటు మంచి జీతం. రవాణా సదు పాయాలను ఆయా కంపెనీలు కల్పించనున్నాయి.

ఇప్పటికే 5వేల మంది రిజిస్ట్రేషన్‌

ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, ఇంటర్మీడియట్‌, డిప్లొమా, డిగ్రీ, బీటెక్‌, ఎంటెక్‌, ఎంబీఏ సహా ఇతర వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసుకుని, ఉపాధి అవకాశాలు లేక ఖాళీగా ఉన్న నిరుద్యోగ యువత కోసం ఈ జాబ్‌మేళాను ఏర్పాటు చేశారు. ఆఫీస్‌ రిసెప్షనిస్టు మొదలు.. ఐటీ ఎంప్లాయి పోస్టు వరకు అన్ని రకాల జాబ్‌ అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి రంగారెడ్డి నుంచి ఇప్పటి వరకు 5వేల మంది నిరుద్యోగులు జాబ్‌మేళాలో పేర్లు నమోదు చేసుకున్నారు. అర్హత, అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వేతనాలు చెల్లించనున్నాయి. ఇంటర్వ్యూలో ఎంపికై న అభ్యర్థులకు వెంటనే ఆయా కంపెనీలు ఆఫర్‌ లెటర్లు ఇవ్వనున్నాయి. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులకు తాగునీరు, బిస్కెట్లు, మజ్జిగను అందజేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement