పాలు పాడవకుండా హైడ్రోజన్ పెరాకై ్సడ్ వినియోగిస్తున్నట్లు గుర్తింపు
కందుకూరు: పాలను కల్తీ చేస్తున్న ఓ డెయిరీపై పోలీసులు దాడి చేశారు. కల్తీకి ఉపయోగిస్తున్న కెమికల్‌తో పాటు కల్తీ అయిన పాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ పరుశురామ్ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని దాసర్లపల్లిలో యాదవ డెయిరీ మిల్క్ బూత్‌లో పాలను కల్తీ చేస్తున్నారనే సమాచారంతో ఉదయం పోలీసులు వెళ్లి తనిఖీ చేశారు. దీంతో అక్కడ ఉన్న హైడ్రోజన్ పెరాకై ్సడ్ బాటిల్‌ను గుర్తించారు. ఎందుకు ఉపయోగిస్తారని నిర్వాహకుడు మారమోని శ్రీశైలంను ప్రశ్నించగా, పాలు చెడిపోకుండా హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడతామని దీంతో ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరం ఉండదని చెప్పాడు. నెలకు రూ.7–రూ.8 వేల వరకు విద్యుత్ చార్జీలు ఆదా అవుతాయని చెప్పాడు. హైడ్రోజన్ పెరాకై ్సడ్ లీటర్ బాటిల్ రూ.150కే దొరుకుతుండటంతో దాన్ని వాడుతున్నట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు హైడ్రోజన్ పెరాకై ్సడ్ కలిపిన 80 లీటర్ల పాలతో పాటు 300 మిల్లీలీటర్ల హైడ్రోజన్ పెరాకై ్సడ్ ఉన్న బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు.


